నాగులకుంట సుందరీకరణ చేయాలి
చౌటుప్పల్ మున్సిపాలిటీలోని నాగులకుంటను సుందరీకరణ చేసి కుంట చుట్టూ ఉన్న కంప చెట్లను తొలగించాలని మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు అవ్వారు రామేశ్వరి డిమాండ్ చేశారు.

దిశ, చౌటుప్పల్ టౌన్: చౌటుప్పల్ మున్సిపాలిటీలోని నాగులకుంటను సుందరీకరణ చేసి కుంట చుట్టూ ఉన్న కంప చెట్లను తొలగించాలని మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు అవ్వారు రామేశ్వరి డిమాండ్ చేశారు. చౌటుప్పల మున్సిపాలిటీలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికై సీపీఎం ఆధ్వర్యంలో.. మంగళవారం పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామేశ్వరి మాట్లాడుతూ.. నాగుల కుంటలోకి మురికి నీళ్లు రాకుండా కాలువతో వర్షపు నీటితో నింపాలన్నారు. కుంట చుట్టూ పచ్చదనం ఉట్టిపడేలా గ్రీనరీ, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని కోరారు. కుంట కట్ట మీద సీసీ రోడ్డు వేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోరుబాట కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్, తంగడపల్లిలోని వివిధ వార్డులను తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్, జిల్లా కమిటీ సభ్యుడు ఎండి. పాషా, మున్సిపల్ నాయకులు బండారు నరసింహ, బత్తుల దాసు, భావండ్లపల్లి స్వామి, బొడ్డు అంజిరెడ్డి, ఎండి. రేష్మ, బొడ్డు రాజు, తూర్పునూరు మల్లేశం, ఎండి. జానీ తదితరులు పాల్గొన్నారు.