వన్యప్రాణుల మాంసం విక్రయం.. ఎక్కడంటే..?

నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో వన్యప్రాణుల మాంసం విక్రయిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు ఆదివారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

Update: 2025-03-23 14:26 GMT
వన్యప్రాణుల మాంసం విక్రయం.. ఎక్కడంటే..?
  • whatsapp icon

దిశ, వేములపల్లి :నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో వన్యప్రాణుల మాంసం విక్రయిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు ఆదివారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శెట్టిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి ఇతర ప్రాంతాల నుంచి నెమలి, దుప్పి మాంసం తీసుకువచ్చి కేజీలుగా ఇతరులకు విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో విక్రయ కేంద్రంపై దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కాగా ఈ మాంసం ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారో, ఇందులో ఎంత మంది భాగస్వాములు అయ్యారో వివరాలను రాబడుతున్నట్లు తెలిసింది. కాగా నిందితుడు తో పాటు భాగస్వాములైన వారి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News