రేవంత్ రెడ్డి.. బట్ట కాల్చి మీద వేస్తుండు: Gutha Sukender Reddy

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు...MLC Gutta Sukhendhar Reddy Serious Comments

Update: 2023-01-20 07:18 GMT

దిశ, నల్లగొండ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన నివాసంలో మాట్లాడుతూ 'ఖమ్మం బహిరంగసభ సెక్యులర్ వాదం ఏకీకరణకు ఉపయోగపడింది. దేశంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక విధానాలు, మతాల మధ్య చిచ్చును అరికట్టేందుకు ఐకమత్యాన్ని సభతో చాటారు. అధికారంలోకి రావాలనే దురుద్ధేశంతోనే బీజేపీ విమర్శలు.దేశంలో బీజేపీ తొమ్మిదేళ్ల పాలనలో పేద ప్రజలపై భారంతోపాటు ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలను ఎందుకు అమ్ముతున్నారు అని బీజేపీ వ్యాపార ధృక్పథంతో పనిచేస్తుంది. ఇది దేశ ప్రజానీకానికి మంచిది కాదు. మంచిని అభినందించి, చెడుని వ్యతిరేకించాలి. నిజాం ప్రభుత్వం తెలంగాణలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. వారికి ప్రభుత్వ లాంఛనాలతో ప్రభుత్వం సహకరిస్తే తప్పేముంది. బీజేపీ తప్పుడు వ్యాఖ్యలు చేయొద్దు. అలాగే ఓట్ల కోసమే బీజేపీ మత రాజకీయాలు చేస్తుంది. గవర్నర్ తమకుండే గౌరవాన్ని కాపాడుకోవాలి. గవర్నర్ అందరితో కలిసి మెలసి ఉండాలి. ఏడూ బిల్లులు గవర్నర్ కి పంపిన పక్కకు పెట్టారు. మీకు నచ్చకపోతే తిరస్కరించవచ్చు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మీద బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఫిబ్రవరిలో అసెంబ్లీ రద్దు చేస్తారన్న రేవంత్ వ్యాఖ్యల్లో నిజంలేదు. జనవరి 31కు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, మార్చిలోపు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. ఇవి కాకుండా ఎలా రద్దు చేస్తారు. ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎలా పనిచేస్తున్నారు అనేది ప్రజలకు తెలుసు' అని తెలిపారు.

Tags:    

Similar News