వానలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె
నల్గొండ జిల్లా కలెక్టర్ ముందు జిల్లా సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో..16 వ రోజు వర్షం వస్తున్నా వర్షంలో గొడుగులతో నిరసన తెలిపారు.
దిశ,నల్లగొండ: నల్గొండ జిల్లా కలెక్టర్ ముందు జిల్లా సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో..16 వ రోజు వర్షం వస్తున్నా వర్షంలో గొడుగులతో నిరసన తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మోల్గురి కృష్ణ బొమ్మగానీ రాజు మాట్లాడుతూ..గత 16 రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న సమగ్ర శిక్షా ఉద్యోగులు విధులు బంద్ చేసి సమ్మె కొనసాగిస్తూ..వివిధ రూపాలలో నిరసన చేస్తున్నారు. తమ డిమాండ్ లపై తక్షణమే ముఖ్యమంత్రి స్పందించి, రెగ్యులర్ చేస్తామన్న హామీని నెరవేర్చాలని కోరారు. అలాగే మోకాళ్లపై వానలో నిల్చొని సమ్మెని కొనసాగించారు
వినూత్నమైన నిరసన
నల్లగొండలో సమగ్ర శిక్ష ఉద్యోగి ఒకరు వినూత్నమైన నిరసన తెలిపారు. తన వేలుకు ఉన్న గోరు పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బొమ్మను వేసుకొని..తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని పెయింట్ తో రాసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజుల , కోశాధికారి పుష్పలత , ముఖ్య సలహాదారు నీలాంబరి, చెపురి పుష్పలత, సావిత్రి, యాదయ్య , సాయిలు, వెంకన్న, నాగయ్య , వెంకటకృష్ణ, గిరిధర్, నాగభూషణం చారి, శ్రీనివాసులు, మోహిజ్ ఖాన్, జానయ్య, భిక్షం, బి సైదులు, చందపాక నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.