గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
దిశ ,మర్రిగూడ: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై ఎం కృష్ణారెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిడమనూరు మండలానికి చెందిన పోలే విష్ణు(25) చండూరు మండల కేంద్రంలో బైక్ మెకానిక్ గా పని చేస్తున్నాడు. రోజు లాగే పని ముగించుకుని తన అత్తగారి గ్రామమైన మర్రిగూడ మండలం మేటి చందాపురం వెళుతుండగా..లెంకలపల్లి గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య మనిషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని..మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.