పుట్ట గూడెం అంగన్వాడీ టీచర్ సస్పెండ్

రాజాపేట మండలం పుట్టగూడెం గ్రామంలోని అంగన్వాడి టీచర్ షహనాజి ని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Update: 2024-12-25 12:56 GMT

దిశ,రాజపేట: రాజాపేట మండలం పుట్టగూడెం గ్రామంలోని అంగన్వాడి టీచర్ షహనాజి ని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం ఐసిడిఎస్ అధికారులు వివరాలు చెప్పారు. బాలామృతం పక్క త్రోవ పట్టిందని నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేసినట్లు తెలిపారు. జిల్లాలోని నాలుగు మండలాల్లో బాలామృతం అంగన్వాడీ కేంద్రాల నుండి పక్కతోవ పట్టిందని ఎస్ఓటి పోలీసులు నిర్ధారించినట్లు తెలిసింది. కల్తీ పాల విక్రయ దందా విషయంలో ఎస్ఓటి పోలీసులు ఆపరేషన్ సందర్భంగా..మోత్కూరు కేంద్రంగా అంగన్వాడీ కేంద్రాల నుండి బాలామృతం పక్కదారి పట్టినట్లు తెలిసింది. దీంతో రాజపేట మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో ఐసిడిఎస్ అధికారులు, ఎస్ఓటి పోలీసులు తనిఖీలు చేయనున్నట్లు సమాచారం.


Similar News