సీఎంను కలిసిన ఎమ్మెల్యే సామేల్ ..ఎందుకంటే..?
అసెంబ్లీలో ఎస్సీ (ఎబిసిడి) వర్గీకరణ బిల్లును ఆమోదించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ కృతజ్ఞతలు తెలిపారు.

దిశ,తుంగతుర్తి: అసెంబ్లీలో ఎస్సీ (ఎబిసిడి) వర్గీకరణ బిల్లును ఆమోదించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు అసెంబ్లీలోనే ఆయనను ప్రత్యేకంగా కలిసి పుష్పగుచ్చం అందిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే సామేల్ దీనిపై అసెంబ్లీలో సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. దశాబ్దాల కాలంగా మాదిగ జాతి ఈ మహోన్నత సమాజానికి సేవ అందించినప్పటికీ అనగదొక్క బడుతున్నారని పేర్కొన్నారు. మాదిగలంతా వ్యవసాయ రంగంలో సచ్చిన గొడ్డు తోలు తీసి మోట బొక్కనకు తొండమయ్యాడని అన్నారు. అంతేకాకుండా కాలుకు చెప్పు,పెళ్లికి డబ్బు అయ్యాడని,గౌడవారికి ముస్తాదులు కుట్టే వారని,యాదవులకు తిత్తికుట్టింది కూడా మాదిగ వాడేనని పేర్కొంటూ పలు విధాలుగా వర్ణించారు. ఆనాడు తెల్లగా ఉండే తోలు చెప్పుకు రుద్దిన వీరరాసే ఈనాడు నెత్తికి రంగులుగా వేసుకుంటున్నారని వివరించారు. అందుకే అన్ని కులాలతో మాదిగలకు సంబంధాలు ఉన్నాయని వివరించారు.
ఇందులో భాగంగానే మాదిగలంతా తమ హక్కుల కోసం పోరాడారని తెలిపారు. చివరికి 40 ఏళ్ల లో జరిగిన పోరాటాన్ని సీఎం రేవంత్ రెడ్డి కేవలం 9 నెలల్లోనే పరిష్కరించారని, అందుకే మాదిగలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారని తెలిపారు. అంతేకాకుండా తమకు సహకరించిన మాలలకు కూడా సామేల్ ధన్యవాదములు తెలిపారు. మనలో మనకు కొట్లాటలు ఎందుకు.. అంత కలిసి ఉందాం అంటూ సామేల్ సూచించారు.