మైనింగ్ ముప్పు.. సాగు తాగునీరు కలుషితం

మైనింగ్ ఏర్పాటు చేయడం అంటేనే ఆ ప్రాంత ప్రజలజీవితాలతో చెలగాటమాడినట్లు అధికారులకు అంతా తెలిసి కూడా అధికార పార్టీ నేతలకు సంబంధించిన సంస్థలకు మైనింగ్ కు అనుమతిస్తున్నారు దీ

Update: 2023-05-19 02:31 GMT

దిశ, నల్లగొండ బ్యూరో: మైనింగ్ ఏర్పాటు చేయడం అంటేనే ఆ ప్రాంత ప్రజలజీవితాలతో చెలగాటమాడినట్లు అధికారులకు అంతా తెలిసి కూడా అధికార పార్టీ నేతలకు సంబంధించిన సంస్థలకు మైనింగ్ కు అనుమతిస్తున్నారు దీనివల్ల చుట్టుపక్కల లో ఉన్న పంట పొలాలు సాగునీటి కాలువలు చెరువులు పూర్తిగా కాలుష్యం కానున్నాయి దానివల్ల పంటలు పండే అవకాశం కాదు కదా ఆ ప్రాంతమంతా విసితుల్యమవుతుంది తద్వారా ప్రజల ప్రాణం ముప్పై పడుతుంది. అందుకే ఈ మైనింగ్ అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత గ్రామాల ప్రజలు కొద్ది రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు

25 ఏళ్ల వరకు లీజు..

నల్గొండ జిల్లా నల్గొండ మండలంలోని నర్సింగ్ బట్ల రెవెన్యూ గ్రామ పరిధిలో గల 980/1, 981/1, 980/A, 982/ip, 982/E2, 983/AIp సర్వే నెంబర్లు ఉన్న సుమారు 48 ఎకరాల భూమిని గాయత్రి మైనింగ్ కంపెనీకి 25 సంవత్సరాలు లీజుకు ఇచ్చారు. ఈ భూమి నుంచి బ్లాక్ గ్రానైట్ తీయనున్నారు. భూమి లోపల 25 ఫీట్ల లోతులో రాయి ఉందని చెప్తున్నారు. మొత్తం 48ఎకరాలు భూమిలో 25 ఫీట్లు లోతు తవ్వాలంటే అందులో వచ్చిన మట్టి ఇతరత్రా రాళ్లు వేరే దగ్గర పోసుకోవడానికి చాలా స్థలం అవసరం ఉంటుంది. కానీ ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా భూములు ఖాళీగా లేవు అన్ని మెట్ట , వరి పంట పండే భూములు ఉన్నాయి.

విష వలయంలో ఆ గ్రామాలు...

మైనింగ్ చేసే ప్రాంతానికి చుట్టుపక్కల నాలుగైదు గ్రామాలు , ఒక సాగునీటి కాలువ ఆ పక్కన చెరువు కలిగి ఉంది. నారబోయిన గూడెం 500 మీటర్లు , కూతురు గూడెం 800 మీటర్లు, గూడపూర్ ఒక కిలోమీటర్, నర్సింగ్ పట్ల రెండు కిలోమీటర్లు ఉంది . 200 మీటర్ల దూరంలో బ్రాహ్మణ,వెల్లంల ప్రాజెక్టు నుంచి వచ్చే సాగునీటి కాలువ ఉంది. ఆ నీళ్లన్నీ నర్సింగ్ బట్ల రెవెన్యూ పరిధిలో ఉన్న గంగాదేవి చెరువులోకి వెళ్తాయి. ఈ మైనింగ్ ప్రాంతానికి గంగాదేవి చెరువుకు మధ్యన దూరం కేవలం 300 మీటర్లు దూరమే. గ్రానైట్ తవ్వకాల కోసం బ్లాస్టింగ్ విధానం, కెమికల్ ఉపయోగిస్తారు. దీనివల్ల ఆ ప్రాంతమంతా కెమికల్ వాటర్ తో నిండే అవకాశం ఉంది. ఈ వృథా కెమికల్ వాటర్ అంతా సాగునీటి కాలువ చెరువులోకి పోయే అవకాశం ఉంది. చెరువులోనే నర్సింగ్ పట్ల గ్రామ ప్రజలకు తాగునీటికి సంబంధించిన బోర్లు ఉన్నాయి. సాగునీటి కూడా అదే నీటిని వాడుతున్నారు. దుమ్ము ధూళి చుట్టుపక్కల ఉన్న మెట్ట వరి పంట భూముల పై పడి పంటలు నాశనమవుతాయని రైతులు భయపడుతున్నారు.

బీఆర్ఎస్ నేత కంపెనీ అయినందునే..

ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతకు సంబంధించిన గ్రానైట్ కంపెనీ కావడంవలన అధికారులు మైనింగ్ కు అనుమతినిచ్చినట్లు తెలుస్తుంది. నర్సింగ్ బట్ల గ్రామ పంచాయతీ అనుమతి తీసుకొని స్థానికంగా ఉన్న ఎంపీటీసీ ఇతరులకు కనీస సమాచారం లేదు. అంతేకాకుండా మైనింగ్ ప్రభావంతో నష్టపోయే గ్రామాలలో కనీసం విచారణ చేయకుండా ఏకపక్షంగా అనుమతి ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ప్రజాభిప్రాయ సేకరణ రోజు కూడా తమ అధికార పార్టీకి చెందిన నాయకులు ఇతర కొంతమందితో మాత్రమే అభిప్రాయం సేకరించి చేతులు దులుపుకున్నట్లు తెలుస్తోంది. ఈ మైనింగ్ బాధిత గ్రామపంచాయతీలు అందరితో అనుమతి తీసుకోవాలని స్థానికుల పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు.

నాలుగు గ్రామాలకు సంబంధించిన ప్రజలు అఖిలపక్ష పార్టీల నాయకులు నిరసనలు,ధర్నాలు,ఆందోళనలు పెద్ద ఎత్తున నిర్వహించారు, జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసి తమ ప్రాణాలకు నష్టం కలిగించే మైనింగ్ ను వెంటనే రద్దు చేయాలని కోరారు.

మైనింగ్ రద్దయ్యే వరకు పోరాటం

చామకూరి మహేష్ నర్సింగ్ బట్ల

మైనింగ్ తో ఈ ప్రాంత ప్రజలకు తీవ్రంగా నష్టం కలిగే ప్రమాదం ఉంది. ఏకపక్షంగా అనుమతి పొందిన మైనింగ్ గ్రానైట్ అనుమతి రద్దయ్యే వరకు పోరాటం కొనసాగిస్తాం.

Tags:    

Similar News