మల్లపురాజు పల్లి హెడ్మాస్టర్ సస్పెండ్..

విధుల్లో నిర్లక్ష్యం, అనుమతులు లేకుండా డ్యూటీ కి డుమ్మా కొట్టిన హెడ్మాస్టర్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

Update: 2024-09-22 09:06 GMT

దిశ, మర్రిగూడ (నాంపల్లి) : విధుల్లో నిర్లక్ష్యం, అనుమతులు లేకుండా డ్యూటీ కి డుమ్మా కొట్టిన హెడ్మాస్టర్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వివరాల్లోకెళితే నాంపల్లి మండలంలోని మల్లపురాజు పల్లి గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్ ఎం. శ్రీనివాసులు విధుల పట్ల నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరైన నేపథ్యంలో డీఈవో బిక్షపతి ప్రాథమిక విచారణ చేసిన అనంతరం ఆదివారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ ఉత్తర్వులు ప్రతులను స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ కు, ఎంఈఓ కు, జెడ్ పి హెచ్ ఎస్ పసునూరు హెచ్ఎం కు జారీ చేశారు.


Similar News