కేజీబీవీలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం....

నడిగూడెం మునగాల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సహాయ వంట మనుషులు, స్వీపర్ పోస్టులకు మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మండల విద్యాధికారి సలీం షరీఫ్ తెలిపారు

Update: 2024-09-22 12:56 GMT

దిశ, కోదాడ : నడిగూడెం మునగాల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సహాయ వంట మనుషులు, స్వీపర్ పోస్టులకు మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మండల విద్యాధికారి సలీం షరీఫ్ తెలిపారు. మునగాలలో సహాయ వంట మనిషి, స్వీపర్/స్కావెంజర్ పోస్టు, నడిగూడెంలో సహాయ వంట మనిషి పోస్టుకు ఈ నెల 23 నుంచి 25 వరకు దరఖాస్తు చేసుకోగలరు. దరఖాస్తుదారులు 18 నుంచి 45 సంవత్సరాల లోపు కనీసం ఏడవ తరగతి విద్యార్హత కలిగి ఉండాలని తెలిపారు. దరఖాస్తులను స్థానిక మండల విద్యా వనరుల కేంద్రంలో అందజేయాలని కోరారు.


Similar News