సూర్య క్షేత్రాన్ని సందర్శించిన మలేషియా దేశస్థులు

జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం శివారులోని శ్రీ అఖండ జ్యోతి

Update: 2023-03-07 13:38 GMT

దిశ, అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం శివారులోని శ్రీ అఖండ జ్యోతి స్వరూప ద్వాదశ సూర్య క్షేత్రాన్ని మలేషియా రాజధాని కౌలాలంపూర్ కు చెందిన 20 మంది యాత్రికులు కుటుంబ సమేతంగా మంగళవారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం భారతదేశంలోని కాశీ, కోణార్క్, అరసవెల్లి దేవాలయాలను సందర్శించామన్నారు.

కాశీలో వేర్వేరుగా సూర్య దేవాలయాలు ఉంటే, దేశంలో ఎక్కడా లేని విధంగా ద్వాదశ ఆదిత్య ఆలయాలు ఒకే ఆవరణలో ఉండడం ఈ క్షేత్ర ప్రత్యేకతగా పేర్కొన్నారు. ఈ ఆలయ విశిష్టతలను గురించి ఆలయ వ్యవస్థాపకులు కాకులారపు జనార్దన్ రెడ్డి వివరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసాదాలను, స్వామి వారి చిత్రపటాలను అందజేసి,సన్మానించారు. ఈ కార్యక్రమంలో మలేషియా దేశస్థులు మరిమారన్,గోపి, రామ్ సెల్వన్, గణేషన్, ఆలయ అర్చకులు శ్రీనివాస శర్మ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.


Similar News