అంతా నా ఇష్టం…ఏమి రాసుకున్న నాకేమి కాదు!

జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో (ఏ పి ఓ ) అకడమిక్ ప్రోగ్రాం అధికారి నియామకం నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ అసిస్టెంట్ (SA)ను నియమించారు.

Update: 2024-07-01 11:34 GMT

దిశ, సూర్యాపేట కలెక్టరేట్ : జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో (ఏ పి ఓ ) అకడమిక్ ప్రోగ్రాం అధికారి నియామకం నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ అసిస్టెంట్ (SA)ను నియమించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏపి ఓ పోస్ట్ కు (SGT) సెకండరీ గ్రేడ్ టీచర్ ను ప్రభుత్వ నిబంధనల ప్రకారం నియమించాలి. కాని సూర్యాపేట జిల్లా విద్యాధికారి కార్యాలయంలో (SA) స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ బోధించే ఉపాధ్యాయుడిని నిబంధనలను తుంగలో తొక్కి ముడుపులకు ఆశపడి జిల్లా విద్యాధికారి నిబంధనలకు విరుద్ధంగా ఏపీవో పోస్టును నియామకం చేపట్టారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం (ఎస్ జి టి ) లనే ఏ పీ ఓ లు గా నియమించినట్లు సమాచారం. కానీ సూర్యాపేట జిల్లాలో జిల్లా విద్యాధికారి తన సొంత అధికారాలతో విద్యాశాఖ నియమాలను పక్కన పెట్టి పలుకుబడి ఉన్న ఉపాధ్యాయ సంఘం నాయకున్ని ఏపీవోగా నియమించుకున్నాడని అతను జడ్.పి.హెచ్.ఎస్ చివ్వేంల పాఠశాలలో చాలా సంవత్సరాలుగా విధులు నిర్వహించినట్లు సమాచారం.( ఎస్ ఏ) లాంగ్ స్టాండింగ్ నుండి ఆ ఉపాధ్యాయుని తప్పించడానికి డీఈవో కార్యాలయంలో ఏపీవో పోస్ట్ లోకి నిబంధనలకు విరుద్ధంగా ఆర్డర్ కాపీ ఇప్పించారని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు . ఫిర్యాదు చేసి వారం రోజులు అవుతున్న ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

అంతా నా ఇష్టం?

ఏమి రాసుకున్న నాకేమి కాదని, ఏపీవోగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు తన తోటి ఉద్యోగులతో చెప్పుకుంటూ దర్జాగా కాలర్ ఎగురవేసుకుంటూ ఉన్నాడని తోటి ఉద్యోగులే గుసగుసలాడుతున్నారు..

నిద్రా వ్యవస్థ లో జిల్లా విద్యాధికారులు..

సూర్యాపేట విద్యా శాఖ కార్యాలయం లో ఏ పి ఓ నియామకం చట్ట విరుద్ధమని తెలిసిన కొంత అమ్యమ్యాలకు ఆశపడి తప్పిదం వెలుగులోకి వచ్చిన ఆ ఉద్యోగి పై చర్యలు తీసుకోవడం లేదు. పెద్ద తతంగమే జరుగుతుందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు రంగంలోకి దిగి ఆ ఉపాధ్యాయుడి పై చర్యలు తీసుకోకుండా చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పడికైనా జిల్లా కలెక్టర్ జిల్లా విద్యా శాఖలో జరుగుతున్న ఏ పి ఓ అక్రమ నియామకం పట్ల విచారణ జరిపి బాధ్యుల పైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుకుంటున్నారు.

వివరణ :-

డి ఈ ఓ అశోక్ ను వివరణ కోరగా మమ్ములను విధులు నిర్వహించేటట్లు లేరని వ్యంగంగా మాట్లాడారు... ఎవరిని నియమిస్తే ఏమవుతుందని సమాధానమిస్తూ వెళ్లిపోయారు.

Similar News