దిశ ఎఫెక్ట్.. ఫారెస్ట్ ఫర్ సేల్ అనే ఆర్టికల్ పై విచారణ..
సూర్యపేట జిల్లా పాలకవీడు మండలంలోని పారెస్ట్ ల్యాండ్ ను కొంతమంది ఆక్రమార్కులు పారెస్ట్ అధికారులతో కుమ్మకై అవినీతికి పాల్పడుతున్నారని దిశ ప్రతిక లో శుక్రవారం పబ్లిష్ అయిన ఫారెస్ట్ ల్యాండ్ ఫర్ సేల్ అనే స్టోరీకి ఫారెస్ట్ ఉన్నతాధికారులు స్పందించారు.
దిశ, నేరేడుచర్ల (పాలకవీడు) : సూర్యపేట జిల్లా పాలకవీడు మండలంలోని పారెస్ట్ ల్యాండ్ ను కొంతమంది ఆక్రమార్కులు పారెస్ట్ అధికారులతో కుమ్మకై అవినీతికి పాల్పడుతున్నారని దిశ ప్రతిక లో శుక్రవారం పబ్లిష్ అయిన ఫారెస్ట్ ల్యాండ్ ఫర్ సేల్ అనే స్టోరీకి ఫారెస్ట్ ఉన్నతాధికారులు స్పందించారు. దీనిపై పూర్తిగా వేదికను అందించాలని ఫారెస్ట్ విజిలెన్స్ స్టేట్ అధికారుల బృందాన్ని విచారణకు ఆదేశించి పంపించారు. విజిలెన్స్ అధికారులు అక్రమనికి గురైన ఫారెస్ట్ ల్యాండ్ ను శనివారం అధికారులు పరిశీలించారు.
దీనికి సంబంధించి విజిలెన్స్ అధికారులు దిశ రిపోర్టర్ తో మాట్లాడారు. దిశ పత్రికలో వచ్చిన వార్తకు ఆధారంగా ఆ వార్తల్లోని ఫోటోలో గల ఆ ప్రాంతాన్ని పరిశీలించాము. ఆ ప్రాంతం లొకేషన్ వివరాలను తీసుకొన్నాము. దీని హైదరాబాద్ లోని తమ ఆఫీసులో ఉన్న జియో కార్డినల్స్ (అక్షాంశాలు రేఖాంశాలు) లోకేషన్ ద్వారా ట్రేస్ చేసి అది ఫారెస్ట్ ల్యాండ్ చేసి కాదా అనే దానిని ఉన్నతాధికారులకు నివేదిక తయారు చేసి అందజేస్తామని తెలిపారు.
విజిలెన్స్ విచారణ పై పలు అనుమానాలు..
విచారణకు హైదరాబాదు నుండి స్టేట్ ఫారెస్ట్ విజిలెన్స్ అధికారుల విచారణ సక్రమంగా చేసి ఉన్నదిఉన్నట్టుగా రాసి నివేదికను ఉన్నత అదికారులకు అందిస్తారా..! లేదా అనే దాని పై ప్రజలలో పలుఅనుమానలు వ్యక్తం అవుతున్నాయి. ఓ పారెస్ట్ అధికారి విచారణకు వచ్చిన విజిలెన్స్ అధికారులతో కలిసి ఓ చోట శుక్రవారం రాత్రి మందుతో విందు ఏర్పాటు చేసినట్లు ప్రజలలో చర్చించుకుంటున్నారు. వీరంతా కలసి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులతో కలిసి శనివారం ఉదయం కబ్జా జరిగిన ప్రాంతాన్ని విజిలెన్స్ అధికారులు పరిశీలించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అదికారులకు తెలియకుండా విచారణ చేయవలసిన విజిలెన్స్ అధికారులు వారితో వెళ్లి పరిశీలించడం వెనుక అంతర్యమేమిటని ప్రజలలో చర్చ జరుగుతుంది.
ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి సమక్షంలోనే విచారణ జరిపితే వాస్తవాలు ఎలా బయటికి వస్తాయని ప్రజలు ప్రజలలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కబ్జాకు గురైన ప్రదేశం నుండి ఫారెస్ట్ వారి వద్ద ఉన్న మ్యాప్ నుండి వెంటనే అది ఏ ల్యాండ్ అని గుర్తించే అవకాశం ఉన్నప్పటికీ హైదరాబాద్ వెళ్లి అక్కడ లొకేషన్ ను పరిశీలించి అది ఏ ల్యాండ్ గుర్తించి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని చెప్పడం వెనుక ఏదైనా ఆంతర్యం ఉందా ..! గతంలో జరిగిన విచారణ లాగానే ఈ విచారణ కూడా జరిగి ఉంటుందా అనే సందిగ్ధం ప్రజలలో నెలకొన్నది. హైదరాబాదులోని ఫారెస్ట్ ఉన్నత అధికారులకు ఇచ్చే నివేదికను బట్టి వీరి విచారణ ఏ విధంగా జరిగి ఉంటుంది అనేది తేల్చాల్సి ఉంది.