గత పాలకుల హయాంలో అభివృద్ధి శూన్యం: మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

2014 లోపు గత పాలకుల హాయంలో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.

Update: 2023-06-09 09:19 GMT

దిశ, మునుగోడు : 2014 లోపు గత పాలకుల హాయంలో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన తెలంగాణ సంక్షేమ దినోత్సవం నియోజకవర్గస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. మునుగోడు నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే అభివృద్ధి గురించి పట్టించుకోలేదని, ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో ప్రజల్లో తను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించడంతో మునుగోడులో అభివృద్ధి పరుగులు పెడుతుంది అన్నారు. పాలనలో బేష్ అనిపించేలా కేసీఆర్ పరిపాలన చేస్తున్నాడన్నారు. సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్ల పరిపాలనలో ఆసరా పెన్షన్లు కై 80 కోట్లు, కల్యాణ లక్ష్మికి 77 వేల కోట్లు, రైతుకు అండగా నిలిచే రైతుబంధుకు 417 కోట్లు, 1057 మందికి రైతు బీమా, ఇంకా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశంలోనే ఆదర్శ సీఎంగా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. రైతు సంక్షేమమే ఏజెండగా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన సాగిస్తున్నారన్నారు.

కేసీఆర్ పథకాలతో తెలంగాణలో అనేక మంది లబ్ధి పొందారని లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కేసీఆరే మళ్ళీ సీఎం కావాలని కోరుతున్నారన్నారు. తెలంగాణ ప్రజలంతా ఒక్క తాటి పై ఉంటే మళ్ళీ కేసీఆరే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. అందుకు ప్రతి ఒక్కరు కేసీఆర్ పథకాలను గడపగడపకు తీసుకెళ్లి ప్రజలకు వివరించాలన్నారు. అనంతరం నియోజకవర్గంలో కులాంతర వివాహం చేసుకున్న వారి ఒక్కొక్క జంటకు రెండున్నర లక్షల రూపాయల చెక్కును అందజేశారు. బీసీల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాన్ని ఆయన ప్రారంభించి ఐదుగురు లబ్ధిదారులకు లక్ష రూపాయలు చొప్పున చెక్కును అందజేశారు. నియోజకవర్గంలో మంజూరైన కల్యాణ లక్ష్మి చెక్కులు, షాది ముబారక్ చెక్కులు సేమ్ రిలీఫ్ ఫండ్ చెక్కులు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, జెడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, ఎంపీపీలు పల్లె కల్యాణి, కర్నాటి స్వామి, జెడ్పీటీసీలు వీరమళ్ళ భానుమతి, కర్నాటి వెంకటేశం, ఎంపీటీసీలు చెరుకు కృష్ణయ్య, బోల్గురి లింగయ్య, సర్పంచులు సర్వి యాదయ్య, ఎంపీడీవో లు విజయ భాస్కర్, యాకూబ్ నాయక్, ఇంచార్జి తహశీల్దార్ నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News