సృష్టికి మూల కారణం నాన్న..!

సమాజంలో సృష్టికి మూల కారణమైన వృక్షం తండ్రి అయితే ! పిల్లలను తల్లి నవ మాసాలు మోసి కంటే ! ఆ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకునే వాడే నాన్న! అని దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్వీటీ అన్నారు.

Update: 2023-06-18 09:48 GMT

దిశ, దేవరకొండ : సమాజంలో సృష్టికి మూల కారణమైన వృక్షం తండ్రి అయితే ! పిల్లలను తల్లి నవ మాసాలు మోసి కంటే ! ఆ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకునే వాడే నాన్న! అని దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్వీటీ అన్నారు. ఆదివారం దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక స్పోర్ట్స్ భవనంలో స్పోర్ట్స్ సభ్యులు కలిసి కేక్ కట్ చేసి ఘనంగా ఫాదర్స్ డే వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్వీటీ మాట్లాడుతూ తల్లి పిల్లలకు ప్రేమను పంచితే తండ్రి ప్రేమతో పాటు ధైర్యం పంచుతూ, వారికి సరైన మార్గంలో నడక నేర్పుతూ తాను కొవ్వొత్తిలా కరుగుతూ పిల్లలకు వెలుగునిచ్చేవాడే కన్న తండ్రి !. అయినా కూడా తండ్రి తమ పిల్లల విషయంలో ఎందుకో వెనుకబడుతున్నాడు అని ఆయన అన్నారు.

కానీ తమ పిల్లలకు ఏది కావాలన్నా నాన్న కొనిపెడతాడు, పండగ వచ్చినప్పుడు తాను కొత్త బట్టలు కొనుక్కోకపోయినా పిల్లలకు, భార్యకు, తప్పనిసరి బట్టలు కొన్నిచేవాడే నాన్న! తన మనసులో ఎంత బాధ ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా ఆర్థికంగా ఉన్నా లేకపోయినా పిల్లల్లోని సంతోషాన్ని వెతుక్కునే వాడే నాన్న!. నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే అయినా కూడా నాన్న ఎందుకు వెనుకబడి పోతున్నాడు, అని ఆయన తన ఆవేదన వ్యక్తపరిచారు. లీగల్ అడ్వైజర్ ఉమామహేష్ మాట్లాడుతూ సమాజంలో తమ తల్లిదండ్రుల గౌరవ ప్రతిష్టలు చాటేలా పిల్లలు చదివి పెద్దవారై ఉన్నత స్థితికి చేరుకున్నప్పుడే తన తల్లిదండ్రులకు మంచి గుర్తింపు వస్తుందని ఆయన అన్నారు.

తల్లిదండ్రుల మనసును అర్థం చేసుకొని కష్టపడి చదివి ఏదో ఒక రంగంలో ఉన్నత స్థితిలో ఉన్నప్పుడే తల్లి కంటే తండ్రి చాలా గర్వపడతాడని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు, అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ ఉమా మహేష్ యాదవ్, రాపోలు నిరంజన్, వద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి, తాళ్ల సురేష్, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు భాస్కర్, డాన్స్ మాస్టర్ రమేష్, జగన్, వివిఆర్, కుమార్ నాయక్, యాదగిరి, ఖాజా, కరాటే మాస్టర్ శ్రీను, సందీప్, నరేష్, జక్కా నరేష్, శ్రీను, పెన్షనర్స్ ప్రధాన కార్యదర్శి అంకం చంద్రమౌళి, యూసఫ్ షరీఫ్, కే గిరి, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News