ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేయాలని పురుగులమందుతో రైతులు నిరసన..
మండల కేంద్రంలో డి రేపాక గ్రామానికి చెందిన రైతులు ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేయాలని పురుగులమందు డబ్బాలతో అంబేద్కర్ చౌరస్తా నిరసన వ్యక్తం చేశారు.
దిశ, అడ్డగూడూరు : మండల కేంద్రంలో డి రేపాక గ్రామానికి చెందిన రైతులు ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేయాలని పురుగులమందు డబ్బాలతో అంబేద్కర్ చౌరస్తా నిరసన వ్యక్తం చేశారు. ఆరు నెలలు కష్టపడి పండించిన పంట వడగండ్ల వర్షాలతో పంట నాశనం అయిపోయింది. మిగిలిన ధాన్యం ఐకేప్ సెంటర్లో అమ్ముకుందామంటే అధికారులు ప్రభుత్వం నుంచి వ్యాపు ఇన్స్టాల్ అవ్వట్లేదని చెబుతున్నారన్నారు.
పక్క జిల్లాలలో ధాన్యం కొనుగోలు చేస్తున్నారన్నారు. కానీ మన అడ్డగూడూరు మండలంలో ఎందుకు చేయట్లేరని అన్నారు. తక్షణమే ధాన్యం కొనుగోలు చేయకపోతే పురుగుల మందు తాగుతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముక్కాముల శ్రీకాంత్, యాదమల్లు, పురుషోత్తం, గొలుసుల ముత్యాలు, సోమన్న, వెంకన్న, ఉమేష్, యాదగిరి, జ్వాల చౌడమ్మ, ముక్కాముల నాగమ్మ, పద్మ, మహిళ రైతులు పాల్గొన్నారు.