Munugodu: ఇష్టానుసారంగా ఫీజులు వసూల్
విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు గా మారి నిబంధనలకు విరుద్దంగా ఇష్టానుసారంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక ఫీజు దోపిడీ చేస్తున్నారు.
దిశ, మునుగోడు: విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు గా మారి నిబంధనలకు విరుద్దంగా ఇష్టానుసారంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక ఫీజు దోపిడీ చేస్తున్నారు. సంపాదనే ధ్యేయంగా ప్రైవేట్ పాఠశాల యాజమానులు కొత్త ఆలోచనలతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నారు. ప్రైవేటు పాఠశాలల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్న అడ్డకట్ట వేయాల్సిన విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. పాఠశాల మొదలు అయిన నాటి నుంచి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఆర్థికంగా పీల్చుకు తినడమే లక్ష్యంగా ప్రైవేట్ పాఠశాల యాజమానులు వ్యవహరిస్తున్నారు. పుస్తకాలు, యూనిపామ్, ట్యూషన్ ఫీజ్, కల్చర్ ప్రోగ్రాంలు తదితర ఫీజుల పేరుతో దొరికిన కాడికి ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థుల నుండి దోచుకుంటున్నాయి. పిల్లలకు ఉన్నత విద్య అందించడం కోసం తల్లిదండ్రులు కడుపుమార్చకొని రూపాయి రూపాయి కూడబెట్టి ఫీజులు చెల్లిస్తున్నారు.
సెంట్రల్ సిలబస్ పేరుతో అధిక ఫీజులు వసూలు
మునుగోడు మండల కేంద్రంలో ప్రైవేటు పాఠశాల యాజమాన్యం కొత్త ఎత్తుగడ విద్యార్థుల నుంచి అధిక ఫీజ్ వసూల్ చేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రంలో వాగ్దేవి ప్రైవేట్ పాఠశాలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా సీబీఎస్ఈ సిలబస్ పేరుతో విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. యూకేజీ కే 20 వేల నుంచి 25 వేల వరకు వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. యూకేజీ కే ఇంత వసూల్ చేస్తే పై తరగతులకు లక్షల్లో వసూలు చేస్తున్నట్లు ఉంది.మండలంలో ఇలాంటి వాటిపై ఎలాంటి నియంత్రణ లేకుండా పోతుంది.
సంపాధన ద్యేయంగా ప్రైవేటు పాఠశాల యాజమాన్యం వ్యాపార సంస్థలు గా మారి విద్యాహక్కు చట్టాన్ని తుంగలో తొక్కి తమ ఇష్టానుసారంగా ప్రైవేటు పాఠశాల యాజమాన్యం విద్యాసంస్థలను నడుపుతున్నాయి. విద్యా శాఖ హక్కు చట్టాలను దిక్కరించి అధిక ఫీజు దోపిడీ చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై సంబంధిత శాఖ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు వాపోతున్నారు. నెల నెల వారి ముడుపు ప్రైవేటు పాఠశాల యాజమాన్యం నుంచి డబ్బు ముట్టుతున్నాయోమేనని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఆందోళనలు చేస్తామని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
పాఠశాలకు సెంట్రల్ అనుమతి లేదు
మునుగోడు మండల కేంద్రంలోని వాగ్దేవి ప్రైవేట్ పాఠశాలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి ఎలాంటి అనుమతి లేదు . అనుమతి లేకుండా సీబీఎస్ఈ పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవు. అనుమతి లేని పాఠశాలల్లో విద్యార్ధుల ను చేర్చి తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు. సీబీఎస్ఈ పేరుతో విద్యార్థుల నుంచి అధిక ఫీజులు బలవంతంగా వసూలు చేయడం సరైంది కాదు.- నర్సింహ్మ, మండల విద్యాధికారి, మునుగోడు