‘పైసా వసూళ్ల పేరుతో ఈ-కేవైసీ’.. గ్రామ పంచాయతీ ఆవరణలో తతంగం

గతంలో ఆరోగ్యశ్రీ ఈ కేవైసీ చేసుకొకుండా తెలంగాణలో మిగిలిన లబ్ధిదారులను ఈ-కేవైసీ చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ప్రజలను కోరిన విషయం విధితమే.

Update: 2024-09-26 08:05 GMT

దిశ, చింతపల్లి: గతంలో ఆరోగ్యశ్రీ ఈ కేవైసీ చేసుకొకుండా తెలంగాణలో మిగిలిన లబ్ధిదారులను ఈ-కేవైసీ చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ప్రజలను కోరిన విషయం విధితమే. అయితే నిబంధనలకు విరుద్ధంగా చింతపల్లి మండల కేంద్రంలోని డప్పు సాటింపు వేయించి గ్రామపంచాయతీ ఆవరణలో బుధవారం రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈ-కేవైసీ కార్డుల కొరకు రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు లింక్ చేసుకోవాలంటూ ప్రజల నుంచి 50 రూపాయల చొప్పున వసూలు చేయడం జరిగింది. దీంతో లబ్ధిదారులు ప్రభుత్వం ద్వారా వచ్చి 50 రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రజలు ప్రశ్నించగా సంబంధిత పంచాయతీ కార్యదర్శి కానీ, ఈ కేవైసీ చేస్తున్న వారు కానీ సరైన సమాధానం ఇవ్వకపోగా గత ఏడాది ఇచ్చిన ఆర్డర్ కాపీ చూపించడం జరిగింది. దీంతో ప్రజలు వచ్చిన వారు అసలా నకిలీవా అనే సందిగ్ధంలో పడిపోయారు.

దీంతో సంబంధిత అధికారులు ప్రజలకు సరైన సమాధానం ఇవ్వలేక పోవడంతో ప్రజలు బిత్తరపోయారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈ -కేవైసీ కార్డులకు సంబంధించి రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు లింక్ చేసుకోవాలనే విషయంలో గ్రామ పంచాయతీలలో క్యాంపులు నిర్వహించి ఈ-కేవైసీలు చేయవలసిందిగా ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవు. ఓపెన్ సైట్ ద్వారా ఇప్పటివరకు ఆ విషయంలో రాష్ట్రంలో ఈ కేవైసీ చేసుకొని వారికి చేసుకోవాల్సిందిగా చెప్పారే తప్ప గ్రామాలలో క్యాంపులు నిర్వహించి చేసుకున్న వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేయాలని ఎక్కడా చెప్పలేదు. ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ సంబంధించిన స్మార్ట్ ఐటీ వర్క్ ఆర్డర్ అమౌంట్ కట్ అవుతుందని ఎక్కడ చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వం పథకమైన ఆరోగ్యశ్రీ, కేంద్ర ప్రభుత్వ పథకమైన ఆయుష్మాన్ భారత్‌లో గత ప్రభుత్వ హయాంలో అనుసంధానం చేయడం జరిగింది, అసమయంలో ఫుడ్ సెక్యూరిటీ కార్డులో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో అందరూ ఈ కేవైసి చేసుకోవలసిందే అని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటి ప్రభుత్వం ఆరోగ్య శ్రీ కార్డులో ఈ -కేవైసీ చేసుకోకుండా మిగిలిపోయిన వారిని చేసుకోవాలని ఆదేశించిందే తప్ప గ్రామాలలో క్యాంపులు నిర్వహించి లబ్ధిదారుల వద్ద నుంచి పైసలు వసూలు చేయమని ఎక్కడ చెప్పలేదు.


Similar News