విధులు ఇక్కడ.. జీతం అక్కడ.. జోరుగా ఉపాధ్యాయుల అక్రమ డిప్యుటేషన్‌లు

నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో ఉపాధ్యాయల డిప్యూటేషన్

Update: 2024-10-25 02:47 GMT

దిశ,చింతపల్లి : నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో ఉపాధ్యాయల డిప్యూటేషన్ ప్రక్రియ అస్తవ్యస్తంగా తయారై, ప్రభుత్వ ఉత్తర్వులను అపహాస్యం చేస్తుంది. మండల విద్యా వ్యవస్థ పని తీరుపై వరుస కథనాలు వార్త పత్రికలో ప్రచురితమైన విద్యాధికారులు పట్టించుకోకపోవడంతో వారి తిరు విస్మయానికి గురిచేస్తుంది.కాంగ్రెస్ ప్రభుత్వం డిప్యూటేషన్లు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వ ఆదేశాలను విద్యాధికారులు బేఖాతర్ చేస్తున్న.ఇది రాజకీయ ఒత్తిడి నా లేదా విద్యా వ్యవస్థ పట్ల నిర్లక్ష్యం మా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల సర్దుబాటు చేస్తుంది.కానీ, కొందరు తమకు అనుకూలంగా ఉంటేనే అక్కడ విధుల్లో చేరుతుండగా,మరికొందరు తమకు అనుకూలమైన పాఠశాలల కోసం నిబంధనలు తుంగలో తొక్కి అక్రమ డిప్యూటేషన్లపై మండలాలు దాటి వస్తున్నారు. ఇంకొందరు వున్న పాఠశాలల్లో విధులు నిర్వహించకుండా వారి అనుకూలమైన ప్రదేశానికి పైరవీలతో వెళ్తున్నారు..దీనితో విధులు ఒకచోట జీతం ఒకచోట అన్నట్లుగా మారింది ఉపాధ్యాయ డిప్యూటేషన్ వ్యవహారం.ఇదిలా ఉంటే అసలు విద్యాశాఖే విద్యార్థుల అవసరాల కోసం కాకుండా ఉపాధ్యాయుల కోరిక మేరకు బదిలీల ఉత్తర్వులు ఇచ్చారనే విమర్శలు వెల్లువెత్తాయి.ప్రజాప్రతినిధులు,రాజకీయ నాయకుల ప్రమేయం,ఉన్నతాధికారుల అండదండలతో ఉపాధ్యాయ సర్దుబాటు ప్రక్రియను ప్రభావితం చేస్తున్నట్లు ఆ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.

కొండమల్లేపల్లి మండలం గన్య నాయక్ తండా ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ టీచర్ నాగేంద్ర చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు .వీరు చింతపల్లి మండలం లో విధుల్లో ఉంటారు.కొండ మల్లేపల్లి మండలం లో జీతాలు తీసుకుంటారు.అదేవిధంగా డీఎస్సీ 2024 నియామకం ఎస్జీటీ టీచర్ గా ప్రియాంక నెల్వలా పల్లి ప్రాథమికోన్నత పాఠశాలకు ఈ నెల 16న విధుల్లో చేరారు. వీరిని అదే మండలం పోలె పల్లి రాంనగర్ కి అనధికారికంగా డిప్యూటేషన్ పై పంపారు.

ఇదంతా ప్రజాధనాన్ని వృధా చేయడానికి లేక ఉన్నతాధికారులు కాసులకు కక్కుర్తి పడి ఆదేశాలు జారీ చేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.పిల్లలు ఎక్కువగా ఉన్న పాఠశాలలో సర్దుబాటు చేస్తే అక్కడికి వెళితే తలనొప్పని కొందరు సుముఖంగా లేరని, ఉత్తర్వులు కాకుండా అధికారుల మౌఖిక ఆదేశాలు, పైరవీలతో పనిచేస్తున్నవారు ఉన్నారనే విమర్శలు ఉన్నాయి.వాస్తవానికి సర్దుబాటు ఆర్డర్ పొందిన వారు ఎక్కడ పనిచేస్తున్నారు?ఎందరు రిపోర్టు చేశారనే రికార్డులు సక్రమంగా లేవని తెలుస్తోంది.అసలు మౌఖిక ఆదేశాలతో వారిని ప్రధానోపాధ్యాయులు ఎలా చేర్చుకుంటున్నారనే ప్రశ్న కూడా తలెత్తుతుంది.

మార్గదర్శకాల ప్రకారం ఉత్తర్వులు ఇవ్వక పోవడం, ధిక్కరిస్తే వెంటనే చర్యలు లేకపోవడం దీనికి కారణంగా తెలుస్తోంది.నిబంధనలు ఉల్లంఘించి ఉత్తర్వులు జారీ అవుతుండటంతో వాటికి విలువ లేకుండా పోతోందన్న చర్చ జరుగుతోంది. ఉపాధ్యాయ డిప్యుటేషన్ల ప్రక్రియలో ముందుగా పాఠశాల కాంప్లెక్స్ పరిధిలో మాత్రమే జరగాలి.తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఒకే మండల పరిధిలోని పాఠశాలల మధ్య డిప్యుటేషన్లపై పంపించవచ్చు.కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నత పాఠశాల టీచర్స్ ను మాత్రం అదే మండలాలోని పాఠశాలలకు పంపించే వెసులుబాటు ఉంది. కానీ,ప్రస్తుతం నిబంధనలు గాలికొదిలేసి,ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు తమకు నచ్చిన ప్రాంతంలో ఇతర మండలాలు, నియోజకవర్గాలకు సైతం డిప్యుటేషన్ పై వెళ్తున్నారు. జిల్లా అధికారుల అనుమతులతో జరిగిన డిప్యుటేషన్లలో సైతం అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

ఇక జిల్లా కలెక్టర్, డీఈవో అనుమతులు లేకుండానే అక్రమంగా మరి కొందరు డిప్యుటేషన్ పై వెళ్లారు.అక్రమ డిప్యుటేషన్ల వల్ల అసలు విద్యార్థులు లేని పాఠశాలల్లో స్టాఫ్ ఉండగా, విద్యార్థులు ఉన్న దగ్గర టీచర్స్ లేక పిల్లల చదువులు వెనుకబడి పోతున్నాయి. ప్రజాప్రతినిధులు,రాజకీయ నాయకుల ప్రమేయం, ఉన్నతాధికారుల అండ దండలతో ఉపాధ్యాయులు వారికి నచ్చిన చోట విధులు నిర్వహిస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి చింతపల్లి మండల కేంద్రాన్ని పునరావస రంగా చేసుకొని “ ఇతర మండలాల నుంచి అక్రమ డిప్యూటేషన్ల పై వచ్చి విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల పై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.


Similar News