తండ్రి కర్మ చేస్తూ తనయుడు మృతి
మృతి చెందిన తండ్రి ఖర్మ కాండ చేస్తూ స్నానానికి వెళ్లి కోనేరులో మునిగి తనయుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని పాత సూర్యాపేట గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.
దిశ, ఆత్మకూర్ ఎస్ : మృతి చెందిన తండ్రి ఖర్మ కాండ చేస్తూ స్నానానికి వెళ్లి కోనేరులో మునిగి తనయుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని పాత సూర్యాపేట గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన పోలోజు మహేష్ చారి (22) తన తండ్రి ఖర్మ కాండ చేసి కోనేరులో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ జారిపడి మృతి చెందాడు. తండ్రి రుక్నాచారికి ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు ఉండగా.. 15ఏళ్ళక్రితం నూతనకల్ మండలం ఎర్రపాడ్ గ్రామానికి బతుకు దెరువు కోసం వెళ్ళాడు. అక్కడే బంగారం పని చేసుకుంటూ.. కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల రుక్నాచారి అనారోగ్యం పాలయ్యాడు. తిరిగి సొంత గ్రామమైన పాత సూర్యాపేటకు వచ్చారు. చికిత్స పొందుతూ గత నెల రోజుల క్రితం రక్నాచారి మృతి చెందాడు. గురువారం బ్రాహ్మణులు చెప్పిన విధంగా తండ్రికి ఖర్మ కాండ చేసేందుకు కొడుకు మహేష్ తో.. కుటుంబ సభ్యులు గ్రామ సమీపంలో ఉన్న చక్రయ్య గుట్ట వద్ద కెళ్ళి ఖర్మకాండు పిండపాయితాల కార్యక్రమం చేశారు. అనంతరం గుట్టపై ఉన్న కోనేరులో కుటుంబ సభ్యులతో కోనేరులో స్నానానికి దిగాడు. ప్రమాదవశాత్తూ కాలు జారి నీటిలోకి జారాడు. మహేష్ తో పాటు బంధువులు పర్నాచారి ఆంజనేయులు ఎస్ స్నానం చేస్తూ కాపాడే ప్రయత్నం చేయగా.. మహేష్ కు ఈత రాకపోవడంతో మునిగి పోయాడు. కళ్ళముందే నీటిలో మునిగిన మహేష్ ఎప్పటికీ తేలకపోవడంతో.. కుటుంబ సభ్యులు బంధువులు రోదించారు. పరిసర ప్రాంతాల రైతులు వచ్చి కోనేరులో మహేష్ మృతదేహంను తీశారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మృతుని తల్లి పోలోజు విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు..కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు శంకర్ నాయక్ తెలిపారు.