డోర్ టూ డోర్ ఫీవర్ సర్వే చేయాలిః కలెక్టర్ తేజస్ నంద్

Update: 2024-08-24 15:39 GMT

దిశ, సూర్యాపేట కలెక్టరేట్: జిల్లాలో డోర్ టు డోర్ ఫీవర్ సర్వే చేయాలని.. ఇందులో గ్రామ పంచాయతీ సిబ్బంది కీలకంగా వ్యవహరించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. కలెక్టరేట్ ఆఫీసులో శనివారం కలెక్టర్ జడ్పీ సిఈఓ అప్పారావుతో కలిసి ఎం.పి.డి. ఓ, ఎం.పి.ఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా పంచాయతీ కార్యదర్శులు బాధ్యత వహించాలని అన్నారు. గ్రామాలలో యాంటీ లార్వా స్ప్రే, పాగింగ్ చేసే విధంగా చూడాలని కలెక్టర్ సూచించారు. పాగింగ్ యంత్రాలకు ఏమైనా మరమ్మతులు ఉంటే చేపించి వాటిని వినియోగంలోకి తీసుకునిరావాలని ఆదేశించారు. పెద్ద గ్రామ పంచాయతీలలో లేకపోతే వాటిని కొనుగోలు చేయాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు డిఎస్ ఆర్ సక్రమంగా చేసే విధంగా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలో, వార్డ్ ల విభజనలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని కలెక్టర్ అన్నారు.


Similar News