సూర్యాపేట జిల్లాలో ఎంత మంది ఓటర్లు ఉన్నారో తెలుసా..?

ఓటర్ల పరంగా తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం సూర్యాపేట జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచింది.

Update: 2025-01-07 09:36 GMT

దిశ,తుంగతుర్తి: ఓటర్ల పరంగా తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం సూర్యాపేట జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచింది.  ఈ మేరకు నియోజకవర్గంలోని 9 మండలాలలో 2 లక్షల 61 వేల 357 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఇందులో 1,29,654 మంది పురుషులు కాగా..1,31,697 మహిళలు ఉన్నారు. అయితే 9 మండలాలలో పరిశీలిస్తే కేవలం తుంగతుర్తి మండలాన్ని మినహాయిస్తే మిగతా 8 మండలాలలో పురుషుల కంటే మహిళ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. మోత్కూరు మండలంలో 13,529 మంది పురుషులు,13,842 మహిళలు కాగా..మొత్తంగా కలుపుకుంటే 27,371 మంది ఉన్నారు. ఇక అడ్డగూడూరులో మొత్తంగా 22,975 మంది ఉండగా..ఇందులో 11,295 పురుషులు,11,680 మహిళలు ఉన్నారు. శాలిగౌరారంలో 40,284 మొత్తానికి గాను 19,889 (పు),20,392 (మ),ఇతరులు 3 చొప్పున ఉన్నారు. జాజిరెడ్డిగూడెంలో 24,497 కి గాను 12,110 (పు), 12,387 (మ),నూతనకల్ లో 28,918 కి గాను 14,429 (పు),14,489 (మ) ఉన్నారు. మద్దిరాలలో 25,243 కి గాను 12,546 (పు), 12,697 (మ),తుంగతుర్తిలో 34,385 కి గాను 17,200 (పు),17,185( మ)..నాగారంలో 24,585 కి గాను 12,144 (పు), 12,438( మ),ముగ్గురు ఇతరులు ఉన్నారు.  తిరుమలగిరి మండలంలో 33,099 మంది ఓటర్లకు గాను 16,512(పు),16,587 (మ) చొప్పున ఉన్నారు. ఇదిలా ఉంటే సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గంలో 2,46,437 మంది ఓటర్లు ఉంటే..హుజూర్ నగర్ లో 2,53,110 ఉన్నారు. కోదాడ లో 2,47,247 మాత్రమే ఓటర్లు ఉన్నారు. తుంగతుర్తితో పాటు మిగతా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పురుషుల కంటే మహిళ ఓటర్లే ఎక్కువగా ఉండడం గమనార్హం.ఓటర్లుగా


Similar News