అవినీతిని వెలికితీయడంలో దిశ ముందంజ...

అవినీతి అక్రమలను ఎండగట్టడంలో, ప్రజా సమస్యలపై అక్షర పోరాటం కొనసాగించడంలో దిశ ముందంజలో ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అనంతగిరి మండల అధ్యక్షులు ముస్కు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Update: 2025-01-07 10:24 GMT

దిశ, అనంతగిరి :అవినీతి అక్రమలను ఎండగట్టడంలో, ప్రజా సమస్యలపై అక్షర పోరాటం కొనసాగించడంలో దిశ ముందంజలో ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అనంతగిరి మండల అధ్యక్షులు ముస్కు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దిశ దినపత్రిక 2025 క్యాలెండర్ ను మంగళవారం ఆయన పార్టీ కార్యకర్తల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గడచిన కొంతకాలంగా దిశ దినపత్రిక అనేక సంచలనాత్మక కథనాలను పాఠకులకు అందించిందన్నారు. మంచి విశ్లేషణాత్మక కథనాలను రాస్తూ, ప్రజలను ఆలోచింపజేస్తున్నట్లుగా తెలిపారు. వరద బీభత్సం కోదాడ ప్రాంతంలో అనేక గ్రామాలను ముంచెత్తిన తరుణంలో స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తో పాటు..దిశ దినపత్రిక రిపోర్టర్లు చేసిన కృషి మరువలేనిది అన్నారు. భవిష్యత్తులో పత్రిక మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చింతకుంట్ల సూర్యం, మొగలాయి కోట గ్రామ శాఖ అధ్యక్షులు కిరణ్ రెడ్డి, , కాంగ్రెస్ నాయకులు ఉయ్యాల వీరయ్య గౌడ్, వీరబాబు, దిశా దినపత్రిక కోదాడ ఇంచార్జ్ పగడాల వాసు, అనంతగిరి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుడిమెట్ల రామకృష్ణ, అనంతగిరి మండల దిశ రిపోర్టర్ కొలిచలం శ్రీనివాస్ ఉన్నారు.

అనతి కాలంలో అగ్రస్థానం

అతి తక్కువ కాలంలో దిశ పత్రిక అగ్రస్థానంలోకి దూసుకెళ్లిందని అనంతగిరి ఎస్సై నవీన్ కుమార్ అన్నారు. అనంతగిరి పోలీస్ స్టేషన్ లో దిశ దినపత్రిక 2025 నూతన క్యాలెండర్ ఆయన ఆవిష్కరించారు. వాస్తవ పరిస్థితుల దృష్ట్యా మంచి కథనాలను దిశ అందిస్తుందన్నారు. మీడియా రంగంలో సాంకేతికతను అందిపుచ్చుకొని మెరుపు వేగంతో వార్తల అందిస్తూ.. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్న "దిశ" దినదినాభివృద్ధి చెంది మరిన్ని సేవలందించాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యలను వెలికి తీసి ప్రభుత్వానికి ,అధికారులకు తెలియజేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయడంలో దిశ తనదైన ముద్ర వేసిందన్నారు.  కార్యక్రమంలో దిశ దినపత్రిక కోదాడ ఇంచార్జ్ పగడాల వాసు, అనంతగిరి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుడిమెట్ల రామకృష్ణ, అనంతగిరి మండల దిశ రిపోర్టర్ కొలిచలం శ్రీనివాస్ అన్నారు.


Similar News