వాస్తవాలను వెలికి తీయడంలో దిశ ముందుంటుంది..
వాస్తవాలను వెలికి తీయడంలో దిశ పత్రిక ముందుంటుందని చింతలపాలెం తహశీల్దార్ టి.సురేందర్ రెడ్డి అన్నారు.
దిశ, చింతలపాలెం : వాస్తవాలను వెలికి తీయడంలో దిశ పత్రిక ముందుంటుందని చింతలపాలెం తహశీల్దార్ టి.సురేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం చింతలపాలెం తహశీల్దార్ కార్యాలయంలో దిశపత్రిక 2025 నూతన క్యాలెండర్ ను చింతలపాలెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరాల కొండారెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీడియా రంగంలో దిశ అంటే ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుందన్నారు.
ఇలాగే వాస్తవాలను నిర్భయంగా వెలికి తీయాలని ఆకాంక్షించారు. రానున్న కాలంలో దిశ పత్రిక మరింత అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నరాల కొండారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నంది రెడ్డి ఇంద్రారెడ్డి, సీనియర్ నాయకులు మోర్తాల సీతారెడ్డి, శివగంగా లిఫ్ట్ చైర్మన్ గుడిసె వెంకట్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ ఇస్మాయిల్, చింతలపాలెం దిశ రిపోర్టర్ ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.