దిశ నిజాలను నిర్భయంగా బయటపెడుతుంది

నల్లగొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దిశ క్యాలెండర్ ని ఆవిష్కరణ చేశారు.

Update: 2025-01-04 12:37 GMT

దిశ,నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దిశ క్యాలెండర్ ని ఆవిష్కరణ చేశారు. వారు మాట్లాడుతూ..దిశ పత్రిక రంగంలో చాలా తక్కువ సమయంలో అందరికీ నికార్సు అయిన వార్తలు అందిస్తూ నిజాలను నిర్భయంగా రాస్తుందన్నారు. ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా అటు ప్రజలకు ప్రభుత్వానికి సమాచారం అందిస్తుందన్నారు. ఇంకా దినదినాభివృద్ధి చెందాలని కోరారు.ఈ ఏడాది లో కూడా దిశ ఇదే చూపుతో సమాజానికి ఉపయోగ పడే కథనాలను అందించాలని కోరారు. ఈ కార్యక్రమం లో ఉమ్మడి నల్లగొండ బ్యూరో గాదె రమేష్,నల్లగొండ ఆర్సీ ఇంఛార్జి ఓడపల్లి మధు,నల్లగొండ క్రైమ్ రిపోర్టర్ జానీ, కనగల్ రిపోర్టర్ నాగయ్య,మల్లేపల్లి రిపోర్టర్ రవి తదితరులు పాల్గొన్నారు.


Similar News