నికార్సైన వార్తలకు దిక్సూచి దిశ :ఎమ్మెల్యే

డిజిటల్ పత్రిక రంగంలో నిఖార్సైన వార్తలకు దిక్సూచి దిశ పత్రిక మాత్రమేనని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.

Update: 2025-01-06 13:40 GMT

దిశ ,మిర్యాలగూడ టౌన్ : డిజిటల్ పత్రిక రంగంలో నిఖార్సైన వార్తలకు దిక్సూచి దిశ పత్రిక మాత్రమేనని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. పట్టణం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం దిశ దినపత్రిక 2025 క్యాలెండర్‌ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తక్కువ కాలంలో ఎక్కువ ప్రజల మన్ననలను పొందిందని అన్నారు. ప్రజల పక్షాన దిశ పత్రిక పని చేస్తుండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు నామిరెడ్డి యాదగిరిరెడ్డి, దిశ రిపోర్టర్ లు యల్లబోయిన సైదులు , కొలిపాక నాగేందర్ , చేరుకుపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.


Similar News