Dindi bus station : చినుకులు పడితే చిత్తడిగా మారుతున్న డిండి బస్ స్టేషన్..
చినుకులు పడితే చిత్తడిగా మారుతున్న డిండి బస్ స్టేషన్ ను ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు.
దిశ, డిండి : చినుకులు పడితే చిత్తడిగా మారుతున్న డిండి బస్ స్టేషన్ ను ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు. మండల కేంద్రంలో బస్ స్టేషన్ కొద్దిపాటి వర్షానికి చిత్తడిగా మారి బస్సులు బయటికి వెళ్లే మార్గం గుంతలతో కూడుకొని, కొద్దిపాటి వర్షానికి నీళ్లు నిలిచి చిత్తడిగా మారుతుందని పలువురు ప్రయాణికులు తెలిపారు.
బస్ స్టాండ్ వెనక భాగంలో గుంతలలో నీళ్లు నిలిచి పందులు స్వైర విహారం చేస్తున్నాయని, మురికి నీటి వాసనతో, దోమలతో నానా ఇబ్బందులు పడుతున్నామని బస్ స్టాండ్ పక్కన కాలనీవాసులు తెలిపారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయాన్నే కాకుండా వాళ్ల క్షేమం కోరి, వెంటనే బస్ స్టాండ్ వెనుక భాగం పరిశుభ్రం చేయాలని పలువురు కోరుతున్నారు.