బస్సు డిపోకు కావాలని ఒకరు..ఫ్లైఓవర్ నిర్మాణం ఆపాలని మరొకరు..
తిరుమలగిరి పట్టణ కేంద్రంలో డిపో ఏర్పాటు
దిశ, తిరుమలగిరి:తిరుమలగిరి పట్టణ కేంద్రంలో డిపో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బస్సు డిపో సాధన సమితి ఆధ్వర్యంలో పలు విధాలుగా ఉద్యమాలు చేపడుతున్నారు. వినతి పత్రాలు,సంతకాల సేకరణ,ధర్నాలు,రాస్తారోకోలు,కరపత్రాల విడుదల మొదలగు కార్యక్రమాల్లో భాగంగా బుధవారం తిరుమలగిరి పాత ఊరు బస్టాండ్ ఆవరణంలో అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.అనంతరం జనగాం-సూర్యాపేట హైవే రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా రాజకీయ నాయకుల మాయ మాటలకు,హామీలకు అర్ధం లేకుండా పోయిందన్నారు.బస్సు డిపో ఏర్పాటు చేయడానికి తిరుమలగిరిలో అన్ని వసతులు,అవకాశాలు ఉన్నాయని,ఆర్టీసీ సంస్థకి సకల విధాల ఆదాయ వనరులు ఉంటాయన్నారు.
అనంతరం ఎక్స్ రోడ్ వరకు వచ్చి భారత జాతీయ రహదారుల అధికార సంస్థ అధికారులు రోడ్డు నిర్మాణ పనుల పరిశీలనకు వచ్చారని తెలుసుకొని ప్లకార్డులతో నిరసనగా అడ్డుకొన్నారు. క్రాస్ రోడ్ లో నిర్మించబోయే ఫ్లైఓవర్ ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.వర్షం పడుతున్న లెక్క చేయకుండా ఆందోళన కొనసాగించారు. ఏమైనా ఫిర్యాదులు ఉంటే ప్రధాన కార్యాలయానికి వచ్చి చేయాలని తెలిపారు.ఇరు కార్యక్రమాల్లో బస్ డిపో సాధన సమితి కన్వీనర్ కడెం లింగయ్య యాదవ్,అఖిలపక్ష నాయకులు కొత్తగట్టు మల్లయ్య,తన్నీరు రాం ప్రభు,కట్కూరి ఉపేందర్,కందుకూరి ప్రవీణ్, మాజీ సర్పంచ్ హరిచంద్ర నాయక్,బత్తుల శ్రీధర్,మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్,మాజీ వైస్ ఎంపీపీ కాంగ్రెస్ జిల్లా నాయకులు సుంకరి జనార్దన్,బత్తుల శ్రీనివాస్,సామ ఆంజనేయులు,మంద పద్మా రెడ్డి,పీడీఎస్యూ నాయకులు కిరణ్, బొడ్డు శంకర్ తదితరులు పాల్గొన్నారు