గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యం

గ్రామీణ ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు

Update: 2025-01-09 10:37 GMT

దిశ, అనంతగిరి: గ్రామీణ ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. గురువారం అనంతగిరి మండలం పరిధిలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులనుండి మంజూరైన 35 లక్షల రూపాయలతో గ్రామపంచాయతీ భవనం, అంగన్వాడి భవనాలకు, అంతర్గత సిసి రోడ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. గొండ్రియాల గ్రామంలో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులు 20 లక్షలతో గ్రామపంచాయతీ నూతన భవనం, శాంతినగర్ గ్రామంలో 12 లక్షలతో అంగన్వాడి భవనం శంకుస్థాపన, పాలారం గ్రామంలో 32 లక్షల రూపాయలతో గ్రామపంచాయతీ భవనం అంగన్వాడి  భవనాలు, అదే గ్రామంలో సిఆర్ఆర్ నిధుల నుండి కోటి 70 లక్షలతో పాలవరం నుండి కిష్టాపురం వరకు బిటి రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అలాగే  అదే గ్రామంలో ఎంఆర్ఆర్ నిధుల నుంచి కోటి 62 లక్ష రూపాయలతో పాలవరం నుండి వయా రంగయ్య గూడం మీదుగా సిఏడి రోడ్డు వరకు బిటి రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం పాలవరం తండాలో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులు 32 లక్షలతో గ్రామపంచాయతీ భవనం అంగన్వాడి భవనాలకు శంకుస్థాపన చేశారు. వసంతాపురం గ్రామంలో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులు 22 లక్షలతో గ్రామపంచాయతీ నూతన భవనానికి శంకుస్థాపన చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..గత ప్రభుత్వం గ్రామాలను నిర్వీర్యం చేసిందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు నిధులు కేటాయించకుండా వివక్ష చూపించడంతో.. చాలా గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రతి గ్రామానికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు,కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ,అనంతగిరి మండల అధ్యక్షులు ముస్కు శ్రీనివాస్ రెడ్డి,ఎంపీడీవో షేక్ సుష్మ,మాజీ ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్లు,మాజీ జెడ్పిటిసి కొణతం ఉమా శ్రీనివాసరెడ్డి,డిప్యూటీ తహసిల్దార్ శ్రీధర్,కొండపల్లి వాసు,బుర్ర పుల్లారెడ్డి,గునుకుల గోపాల్ రెడ్డి,డేగ కొండయ్య,ఈదుల కృష్ణయ్య, ఆయా గ్రామాలకు గ్రామ శాఖ అధ్యక్షులు వివిధ శాఖల అధికారులు,పంచాయతీ కార్యదర్శులు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Similar News