కోదాడలో కాక రేపుతున్న దళితబంధు రాజకీయం
కోదాడ నియోజకవర్గంలో దళిత బంధులో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ , దమ్ముంటే నిరూపించాలంటూ అధికార పార్టీ ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు , ప్రతి విమర్శలతో కోదాడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది
దిశ, కోదాడ టౌన్: కోదాడ నియోజకవర్గంలో దళిత బంధులో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ , దమ్ముంటే నిరూపించాలంటూ అధికార పార్టీ ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు , ప్రతి విమర్శలతో కోదాడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సోమవారం నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ప్రెస్ మీట్ లో గుడిబండ కు చెందిన కొందరు దళిత బంధు లబ్ధిదారులతో కలిసి ఎంపీ ఉత్తమ్ మాట్లాడుతూ.. కోదాడ నియోజకవర్గంలో దళిత బంధులో 5 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ , గత ఎనిమిది నెలల క్రితమే ఈ విషయం తన దృష్టికి రాగా అప్పటి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కి ఫిర్యాదు చేయగా ఎలాంటి చర్యలు తీసుకోక పోగా ఆ కలెక్టర్ కు ప్రభుత్వం నల్గొండ జిల్లా కలెక్టర్ గా ప్రమోషన్ కూడా ఇచ్చిందంటూ విమర్శించారు . ఇప్పటికైనా దళిత బంధు అవినీతిపై ఎంక్వైరీ చేయ్యాలని ప్రభుత్వాన్ని కోరారు .
ఎక్కడైనా ప్రమాణానికి సిద్ధం - ఎమ్మెల్యే
మంగళవారం ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఎమ్మెల్యే బొల్లం . మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ దళితబందు లో ఎలాంటి అవినీతి జరగలేదని ఈ విషయంలో తాను ఎక్కడైనా ప్రమాణానికి సిద్ధం అని , ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రమాణానికి సిద్ధమా అని సవాల్ విసిరారు . ఇక ఇదే విషయం పై కోదాడ ఎంపీపీ కవిత కూడా ప్రెస్ మీట్ నిర్వహించి దళిత బంధును రాజకీయాలకు వాడుకుంటున్నారని , కావాలనే లబ్ధిదారులు కొందరికి డబ్బులు ఇప్పించి తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని ఎంపి ఉత్తమ్ రాజకీయంగా ఎవరిని ఎదగనియ్యరని విమర్శించారు .
బుధవారం బీఎస్పీతో కలిసి కాంగ్రెస్ మండల అధ్యక్షుడి మరో ప్రెస్ మీట్
బుధవారం బీఎస్పీ పార్టీ రాష్ట్ర ఈసీ మెంబర్ పిల్లుట్ల.శ్రీనివాస్ తో కలిసి కోదాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూమాటి . వరప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడుతూ దళిత బందు లబ్ధిదారులు మాకు అన్యాయం జరిగింది , మీ సహాయం మాకు కావాలి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కోరారని , ముందుగా ఉత్తమ్ నో , నేను విమర్శించలేదని , అసలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ఇదంతా అని ఆయన అన్నారు . ఎంపి ఉత్తమ్ ను విమర్శించే స్థాయి ఎంపీపీ ది కాదని , మరో ఐదు నెలలో వడ్డీతో సహా అన్ని చెల్లించుకోవాలని హెచ్చరించారు.
దళిత బంధు అధికార పార్టీ కి వరమా ? శాపమా?
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నియోజకవర్గంలో దళిత బంధు వ్యవహారం ఒక్క సారిగా తీవ్ర దుమారాన్ని లేపింది . ఈ విషయం ఇంతటితో సద్దుమణుగుతుందా లేదా అన్నది వేచి చూడాలి . దళితబందు లో ఎలాంటి అవినీతి లేదని అధికార పార్టీ నిరూపించుకొని ఈ స్కీమ్ ఆ పార్టీకి వరమవుతుందా ? లేక శాపమవుతుందా అన్నది త్వరలోనే తెలుస్తుందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు .