సుపారీ హత్యకు ప్లాన్.. ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ హత్యకు కుట్ర

Update: 2023-06-21 16:59 GMT

దిశ, కోదాడ టౌన్: కోదాడ పట్టణంలో ఒక కళాశాల కరస్పాండెంట్‌ను హత్య చేయించటానికి మరో కళాశాల కరస్పాండెంట్‌తో పాటు మరికొందరు 50 లక్షల సుపారీ ఇచ్చి డీసీఎం తో గుద్ది చంపేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ ఘటనతో పట్టణ ప్రజలు ఒక్క సారిగా ఉలిక్కిపడ్డారు. దాదాపు ఒక వారం నుండి రెక్కీ నిర్వహించిన తర్వాత ఈ నెల 19 న మునగాల మండలం మొద్దుల చెరువు స్టేజి సమీపంలో సూర్యాపేట నుండి కారులో వస్తున్న బుద్దె కాంతారావు ను సుపారీ తీసుకున్న వ్యక్తులు డిసిఎం తో కారును ఢీ కొట్టాలని చూశారు. అయితే వారి ప్లాన్ విఫలం అవ్వడంతో అదే రోజు రాత్రి మరోసారి బాబునగర్ వద్ద ప్రయత్నిoచి విఫలమయ్యారు.

దీంతో నిందితులను స్థానికులతో కలసి పట్టుకున్న కాంతారావు కోదాడ పట్టాణ పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొత్తం 12 మందిని ఇందులో నిందితులుగా పేర్కొన్నారు. వారిలో ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వీరి వద్ద నుండి 5 లక్షల రూపాయల డబ్బులు, ఒక డిసిఎం వ్యాన్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీరిపై 120బి , 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కోర్టు వద్ద హై డ్రామా..

నిందితులలో మరో కళాశాల చైర్మన్ అయినా నీలా సత్యనారాయణ కోర్టు వద్దకు రాగానే తనకు ఎలానో ఉందని, ఛాతిలో నొప్పి వస్తుందని అనగానే న్యాయమూర్తి ఆదేశాలతో అతనిని ముందుగా ప్రభుత్వ వైద్యశాలకు అనంతరం అక్కడ నుండి మరో ప్రయివేట్ వైద్యశాలకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం డాక్టర్ అతనిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తీసుకెళ్లమని రిఫర్ చెయ్యడంతో తిరిగి మరోసారి న్యాయవాది ముందు ప్రవేశ పెట్టడంతో న్యాయవాది ఆదేశానుసారం గాంధీ హాస్పిటల్‌కు తరలించినట్లు సమాచారం.


Similar News