Open school Admissions :ఓపెన్‍ టెన్త్‌,ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పొడిగింపు

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్ల గడువును ఈనెల 30 వరకు మరోసారి పొడిగించినట్లు మేళ్లచెరువు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కోఆర్డినేటర్. వెంకటరెడ్డి, ఓపెన్ స్కూల్ సొసైటీ అసిస్టెంట్ కోఆర్డినేటర్ పి శ్రీమన్నారాయణ తెలిపారు.

Update: 2024-10-25 14:40 GMT

దిశ, మేళ్లచెరువు : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్ల ( Open school Admissions ) గడువును ఈనెల 30 వరకు మరోసారి పొడిగించినట్లు మేళ్లచెరువు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కోఆర్డినేటర్. వెంకటరెడ్డి, ఓపెన్ స్కూల్ సొసైటీ అసిస్టెంట్ కోఆర్డినేటర్ పి శ్రీమన్నారాయణ తెలిపారు. శుక్రవారం మాట్లాడుతూ.. చదువు మధ్యలో మానేసిన వారు పదవ తరగతికి దరఖాస్తు చేసుకోవచ్చని, 10 పాస్ అయిన ఇంటర్ ఒక సంవత్సరంలో పూర్తి చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. పదవ తరగతి అడ్మిషన్స్ కోసం రికార్డ్ షీట్, ఆధార్ కార్డు కుల దృవీకరణ పత్రం, ఇంటర్ అడ్మిషన్ల కోసం పదవ తరగతి టీసి, పదవ తరగతి మేమో కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు ఫోటోతో దరఖాస్తు చేసుకోవాలని వారు కోరారు.


Similar News