MLA JAIVEER REDDY :పంట నష్ట పోయిన రైతుల వివరాలు సేకరించండి..

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న వరి పంట నష్ట వివరాలను వ్యవసాయ అధికారులు వెంటనే రైతు నుంచి సేకరించాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి ( Mla jaiveer Reddy ) అధికారులను ఆదేశించారు.

Update: 2024-10-25 13:39 GMT

దిశ , హాలియా : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న వరి పంట నష్ట వివరాలను వ్యవసాయ అధికారులు వెంటనే రైతు నుంచి సేకరించాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి ( MLA JAIVEER REDDY  ) అధికారులను ఆదేశించారు. మండలంలోని మదారి గూడెం గ్రామంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న వరి పంటను శుక్రవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా భారీ వర్షాలతో చేతికి వచ్చిన తమ పంటలను కోల్పోయామని రైతులు ఎమ్మెల్యే జై వీర్ (MLA JAIVEER REDDY ) ముందు వాపోయారు. ఇప్పటి వరకు పంట కోసం రూ. వేలల్లో ఖర్చు చేశామని, తీరా పంట చేతికి వచ్చే సమయంలో భారీ వర్షాలతో పంట పూర్తిగా నేలబారిపోయిందని బోరున విలపించారు. స్పందించిన ఎమ్మెల్యే జైవీర్ ( MLA JAIVEER REDDY  ) రెడ్డి పంట నష్టం వివరాలను రైతుల వారీగా గ్రామాల వారీగా అత్యవసరంగా సేకరించాలని సూచించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. వ్యవసాయ అధికారులు తక్షణమే పంట నష్టం వంచనాలపై నివేదిక రూపొందించాలని తెలిపారు. ఆయన వెంట హాలియా మార్కెట్ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కుందూరు వెంకట్ రెడ్డి కాల్సాని చంద్రశేఖర్ మండల వ్యవసాయ అధికారి సరిత రిక్కల వెంకటరెడ్డి పోచం శ్రీనివాస్ గౌడ్ సుధాకర్ రెడ్డి పలువురు కాంగ్రెస్ నాయకులు రైతులు ఉన్నారు.


Similar News