క్రీస్తు బోధనలు అనుసరణీయం

శాంతి, కరుణ, దయ గుణాలతో మానవాళి ఉండాలనే విధంగా క్రీస్తు చేసిన బోధనలు అనుసరణీయమని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు.

Update: 2024-12-25 11:33 GMT

దిశ, నకిరేకల్ : శాంతి, కరుణ, దయ గుణాలతో మానవాళి ఉండాలనే విధంగా క్రీస్తు చేసిన బోధనలు అనుసరణీయమని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని నకిరేకల్ నియోజకవర్గంలోని కేతేపల్లి మండలంలో ఉన్న రాయపురం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. నార్కట్ పల్లి పట్టణంలోని మదర్ థెరీసా సొసైటీ ఆధ్వర్యంలో..అందించే బట్టల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పలు చర్చిలో కేకులను కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బత్తుల ఊషయ్య గౌడ్, నాయకులు దూదిమెట్ల సత్తయ్య, వడ్డె భూపాల్ రెడ్డి, పాశం శ్రీనివాస్ రెడ్డి, జేరిపోతుల భరత్, తదితరులు పాల్గొన్నారు. 


Similar News