BREAKING: తెలంగాణలో మరో సంచలన ఘటన..యువకుల వేధింపులతో యువతి ఆత్మహత్య

రాష్ట్రంలో మహిళలు, యువతులపై ఆఘాయిత్యాలు ఆగడం లేదు. చట్టాలు ఎన్ని వచ్చినా అకృత్యాలకు అంతే లేకుండా పోతోంది.

Update: 2024-07-11 03:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మహిళలు, యువతులపై ఆఘాయిత్యాలు ఆగడం లేదు. చట్టాలు ఎన్ని వచ్చినా అకృత్యాలకు అంతే లేకుండా పోతోంది. కామంతో కళ్లు మూసుకున్న కొందరే కీచకులు చిన్నా, పెద్దా తేడా లేకుండా కామాంధులై బరితెగిస్తున్నారు. సభ్యసమాజానికి తలవొంపులు తీసుకొస్తూ యువతుల తల్లిదండ్రుల్లో అభద్రతాభావాన్ని నింపుతున్నారు. ఈ క్రమంలోనే నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం చింతలగూడెంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఆకతాయిల వేధింపులు భరించలేక ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది.

యవతికి ఇష్టం లేకపోయినా ప్రేమించాలని, తాము చెప్పినట్లుగా వినాలని నిత్యం ఇద్దరు యువకులు ఆ యువతి వెంటపడి వేధించారు. ఒకవేళ తాము చెప్పినట్లు వినకపోతే సోషల్ మీడియాలో ఫొటోలో పెడతామని బెదిరింపులకు గురి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఈనెల 6న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. అయితే, చనిపోయే మందు యువతికి జడ్జికి మరణ వాంగ్మూలం ఇవ్వడంతో మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆకతాయిల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.   


Similar News