కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్ప ప్రజలకు రక్షణ లేదు.. భట్టి విక్రమార్క

దేశ ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న బీజేపీని దూరంగా పెట్టాలని చెప్పిన సీఎం కేసీఆర్ గవర్నర్ తో కలిసి పోవడంతో ఆ రెండు పార్టీల నిజస్వరూపం బయటపడిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

Update: 2023-06-17 09:40 GMT

దిశ, నల్గొండ బ్యూరో : దేశ ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న బీజేపీని దూరంగా పెట్టాలని చెప్పిన సీఎం కేసీఆర్ గవర్నర్ తో కలిసి పోవడంతో ఆ రెండు పార్టీల నిజస్వరూపం బయటపడిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా జి చెన్నారం నుంచి శనివారం ఉదయం ప్రారంభమైన పాదయాత్ర మధ్యాహ్నం నల్గొండ పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు కలిసి నాటకం ఆడుతున్నాయని మొదటి నుంచి తాము చెప్తుందామని అన్నారు. ఇప్పుడు అసలు రూపం బయటపడిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇతర పార్టీల ఉనికి లేకుండా చేయాలని బీజేపీ టీఆర్ఎస్ కుట్ర పన్నాయని విమర్శించారు.

రాజ్యాంగపరమైన సందర్భాల్లో కూడా సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ ఒక్కటేనన్న విషయం అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పమన్నారు. అయితే ఇప్పుడు గవర్నర్ తో కలిసి బేరం కుదుర్చుకున్న సీఎం కేసీఆర్ వారితో చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారని అన్నారు. కానీ తెలంగాణ ప్రజలు అమాయకులు కారని ఏ ప్రభుత్వము ఏ రాజకీయ పార్టీ చేస్తున్న విధానాన్నిటిని గమనిస్తూ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ఫాసిస్టు విధానాలను అమలు చేస్తున్నారని విమర్శించారు. అందులో భాగంగానే ప్రజల కోసం పనిచేస్తున్న ప్రజాసంఘాలు మేధావులు ముఖ్యంగా ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్ల పై కేసులు పెట్టడం హాస్యాస్పదమన్నారు. ఇలాంటి భావజాలం కలిగిన ప్రభుత్వాలను ఓడించేందుకు అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.

అందులో భాగంగానే ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పునరేకికరణ జరుగుతుందని పేర్కొన్నారు. ప్రగతిశీల భావాలు కలిగిన వాళ్లంతా ఏకమై బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలన్నారు. దానికోసం ప్రగతిశీల భావాలు కలిగిన సంఘాలు పార్టీలు కలిసి ఏకం కావలసిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్ప ప్రజలకు రక్షణ లేదన్న విషయాన్ని తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అనేక కుంభకోణాలు చేసిందని వాటిల్లో ఓఆర్ఆర్, విలువైన భూముల అమ్మకాలు, కాళేశ్వరం ప్రాజెక్టులో నిధుల గోల్మాల్, లిక్కర్ స్కాం, ఇలాంటివి అనేకం ఉన్నాయన్నారు. ఈ అభివృద్ధి అంతా తమ దగ్గర ఉందన్న మోదీ అమిత్ షాలు ఎందుకు కేసీఆర్ ప్రభుత్వం పై చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.

పట్టించేందుకు ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకోవడం తప్ప ఒరిగిందేమీ లేదన్నారు. అయితే ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది ఆ రెండు పార్టీల అసలు స్వరూపం బయటపడుతుందన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని సమాజానికి అర్థం కావడంతో ఆ పార్టీలోకి వెళ్లిన నాయకులు రానున్న 4 రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉంటాయని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, లౌకికవాదాన్ని కాపాడుకోవడంకోసం ప్రతి ఒక్కరు గ్రామస్థాయి నుంచి కలిసి రావాలని, తద్వారా నవ తెలంగాణ నిర్మాణం కోసం అందరం కలిసి పని చేద్దాం అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ నదుల పై ప్రత్యేక కట్టడాలు కట్టలేదని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసిన అదనంగా ఒక ఎకరా కూడా సాగునీరు అందించలేదని తెలిపారు. ఒకవేళ ఎక్కడైనా అందిస్తే ప్రజలకు చూపించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రజలకు సంబంధించిన గుండెచప్పుడు వారి ఆవేదనను మీడియా సాక్షిగా తెలంగాణ సమాజానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు పీపుల్స్ మార్చి పాదయాత్ర మొదలు పెట్టి జూన్ 16 తో మూడు నెలలు పూర్తయింది అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి ఠాక్రే ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారని వీరితోపాటు ఇంకెవరినైనా ఇంచార్జిగా నియమించాలంటే ఏఐసీసీ అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో జడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య, ఎంపీపీ సుమన్, వైస్ ఎంపీపీ రమేష్, మాజీ జెడ్పిటీసీ గుమ్ముల మోహన్ రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు

Tags:    

Similar News