అంగన్వాడి టీచర్ల పై సస్పెన్షన్ వేటు..
జిల్లాలోని అంగన్‌వాడీలలో బాలామృతాన్ని పక్కదారి పట్టించారని విచారణలో వాస్తవమని నిర్ధారణ అవ్వడంతో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అంగన్వాడీ టీచర్లను సస్పెండ్ చేశారు.
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : జిల్లాలోని అంగన్‌వాడీలలో బాలామృతాన్ని పక్కదారి పట్టించారని విచారణలో వాస్తవమని నిర్ధారణ అవ్వడంతో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అంగన్వాడీ టీచర్లను సస్పెండ్ చేశారు. భువనగిరిలో పశువుల పాకలో బాలామృతం లభించడంతో దీనిపై అధికారులు విచారణ జరిపారు. ఈ నివేదికను జిల్లా కలెక్టర్ కు అందించారు. యాదగిరిగుట్ట 3వ సెంటర్, మంతపురి, పుట్టగూడెం, మోత్కుర్ 7వ అంగన్వాడి సెంటర్లలో పనిచేస్తున్న టీచర్లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.