సమగ్ర శిక్ష ఉద్యోగుల ర్యాలీ..

తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని సమగ్ర శిక్ష

Update: 2025-01-02 11:19 GMT

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మె 24వ రోజుకు చేరుకుంది. గురువారం ఉద్యోగులు భువనగిరి పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో మానవహారం ఏర్పాటు చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. సుమారు గంటపాటు అంబేద్కర్ చౌరస్తా వద్ద సమగ్ర ఉద్యోగులు చేస్తూ తన ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని నినాదాలు చేశారు.‌ సీఎం‌ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు.


Similar News