సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి సుదర్శన లక్ష్మీనారసింహ దివ్యస్వర్ణ విమాన గోపురమహా కుంభాభిషేక మహోత్సవానికి రావాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.

Update: 2025-01-04 14:17 GMT

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి సుదర్శన లక్ష్మీనారసింహ దివ్యస్వర్ణ విమాన గోపురమహా కుంభాభిషేక మహోత్సవానికి రావాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.  దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమీషనర్ ఎన్. శ్రీధర్ ల ఆధ్వర్యంలో..యాదగిరిగుట్ట ఆలయ ఈవో, అర్చకులు కోరారు. శనివారం ఆలయ ప్రధాన అర్చకులు నల్లంథీఘల్‌ లక్ష్మీనరసింహాచార్యులు, ఈవో భాస్కరరావు సీఎంను కలిపి ఆహ్వాన పత్రిక అందించారు. ఫిబ్రవరి 23వ తేదిన దివ్యవిమాన స్వర్ణ గోపుర మహా కుంభ అభిషేకం జరగనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎంకు స్వామి వారి ప్రసాదము, శేషవస్త్రం అందజేశారు.


Similar News