ప్రజా సమస్యలు వెలికితీయడంలో దిశ ముందుంటుంది..
జిల్లాలో జరిగే ప్రజా సమస్యలను వెలిక్కి తీయాలనీ జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు.
దిశ,సూర్యాపేట టౌన్; జిల్లాలో జరిగే ప్రజా సమస్యలను వెలిక్కి తీయాలనీ జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్పి జిల్లా కార్యాలయంలో దిశ దినపత్రిక క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఎప్పటికప్పుడు వార్తలు రాస్తూ దిశ డిజిటల్ రంగంలో ముందంజలో ఉందన్నారు. దిశ ముందు రోజుల్లో ఇంకా అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ సందర్భంగా దిశ దినపత్రిక యాజమాన్యానికి జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దిశ రిపోర్టర్లు తండా నాగేందర్, బొల్లికొండ వీరస్వామి,కొంగల సతీష్,పెద్దపోలు వీరయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.