విద్యుదాఘాతంతో యువకుడు మృతి
విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది.
దిశ, హాలియా : విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని రామడుగు గ్రామానికి చెందిన నిమ్మల ప్రభాకర్ రెడ్డి (23) శుక్రవారం పొలం వద్ద చెట్టు కొడుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు 11 కెవి విద్యుత్ వైర్ తగలడంతో..విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు హాలియా ఎస్సై సతీష్ రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సాగర్ కమలా నెహ్రూ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.