ఆగని ఆర్ఎంపీ వైద్యుల ఆగడాలు.. వైద్యం వికటించి మహిళ మృతి

Update: 2023-09-30 14:22 GMT

దిశ, హుజూర్ నగర్: వైద్యం వికటించి మహిళా మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. హుజూర్ నగర్ ఎస్సై హరికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన దేనమకొండ పద్మ, భర్త లేట్ నాగరాజు (40) వివాహిత గత వారం రోజుల నుండి అనారోగ్యంతో బాధ పడుతుండగా స్థానిక ఆర్ఎంపీ అయిన తంగెళ్లపల్లి రమేష్ తో ట్రీట్ మెంట్ తీసుకుంటుంది.

దీంతో ఈనెల 29న ఉదయం పద్మకు పిట్స్ రావడంతో పట్టణంలోని సిరి హాస్పటల్‌కు తీసుకెళ్లగా వారు సీరియస్‌గా ఉన్నందున ఖమ్మం తీసుకెళ్ళమని సూచించారు. అయితే ఖమ్మంలోని కిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినదని అక్కడి వైద్యులు తెలిపారు. ఆర్ఎంపీ తంగళ్ళపల్లి రమేష్ ఎక్కువ డోస్ ఇవ్వడం వలనే పద్మ మృతి చెందినదరి కుమారుడు నవీన్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరికృష్ణ విలేకరులకు తెలిపారు.

గత కొద్ది రోజుల క్రితం పట్టణంలోని ఒక ఆర్ఎంపీ హాస్పిటల్‌లో బాలుడు వైద్యం వికటించి మృతి చెందిన సంఘటన మరువక ముందే వైద్యం వికటించి మరో మహిళా మృతి చెందడంతో పట్టణ ప్రజలు భయ ఆందోళనలకు గురి అవుతున్నారు. ఇంత జరుగుతున్న జిల్లా వైద్య అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగావ్యవహరిస్తున్నారని పట్టణ ప్రజలు వాపోతున్నారు.


Similar News