చంద్రయాన్ -3 టీం లో గరిడేపల్లి వాసి
చంద్రయాన్ -3 శాటీలైట్‌ను భారత ప్రభుత్వం శ్రీహరికోట నుండి ఇటీవల పంపిన విషయం తెలిసిందే.
దిశ నేరేడుచర్ల: చంద్రయాన్ -3 శాటీలైట్‌ను భారత ప్రభుత్వం శ్రీహరికోట నుండి ఇటీవల పంపిన విషయం తెలిసిందే. అయితే ఈ చంద్రయాన్ -3 జాబిల్లి పై అడుగుపెట్టిన తొలి దేశంగా భారతదేశం రికార్డ్ సృష్టించింది. అయితే ఈ రోవర్ కోసం పనిచేసిన 6 సభ్యుల టీంలో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రానికి చెందిన బండ సుష్మ అందులో ఒకరని ఆమె తండ్రి బండా నర్సింహారెడ్డి తెలిపారు. ఈమె అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ లో( ఐఐఎస్‌టి) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పెస్ సైన్స్ అండ్ టెక్నాలజీ) పూర్తి చేసింది. ప్రస్తుతం ఈమె శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగశాలలో పనిచేస్తుంది. ఈ సందర్భంగా సుష్మను ప్రజా ప్రతినిధులు, బంధువులు, మిత్రులు సోషల్ మీడియా ద్వారా అభినందించారు.