వీధి కుక్కల దాడిలో 20 గొర్రెలు మృతి

చింతలపాలెం మండల పరిధిలోని పులిచింతల ప్రాజెక్టు కాలనీ గ్రామంలో సోమవారం రాత్రి గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేశాయి.

Update: 2024-11-12 15:12 GMT

దిశ, చింతలపాలెం: చింతలపాలెం మండల పరిధిలోని పులిచింతల ప్రాజెక్టు కాలనీ గ్రామంలో సోమవారం రాత్రి గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో 20 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. యజమాని ఆనంగి వెంకయ్య తెలిపిన వివరాల ప్రకారం.. తను గొర్రెలను రోజువారీగా సాయంత్రం వరకు అడవిలో మోపుకొచ్చి తన ఇంటి ఎదురుగానున్న గొర్రెల దొడ్డిలో పెట్టి పడుకున్నానని తెలిపారు. రాత్రి సమయంలో కొన్ని కుక్కలు వచ్చి దొడ్డిలో ప్రవేశించి.. గొర్రెలపై దాడి చేయగా  20 గొర్రెలు మృతి చెందినట్లు ఆయన తెలిపారు. ఈ దాడితో తనకు రెండు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం తనను ఆదుకొని తనకు న్యాయం చేయాలని కోరారు. గ్రామంలో వీధి కుక్కల నివారణకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్ చేస్తున్నారు. 


Similar News