దిశ,నల్లగొండ : నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలో అక్రమ గంజాయి రవాణా చేస్తున్న నలుగురు నిందితుల నుంచి రూ.40 లక్షల 90వేల విలువైన 163.820 కిలోల గంజాయిని పట్టుకున్నట్టు డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 4 సెల్ ఫోన్ లు, రెండు కార్లు స్వాదీనం చెసుకున్నట్లు శివరాం రెడ్డి వివరించారు. నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల ప్రకారం డీఎస్పీ పర్యవేక్షణలో నిందితులను పట్టుకున్నారు. నార్కట్ పల్లి–అద్దంకి రాష్ట్ర రహదారి పై రెండు కారుల్లో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నారనే సమాచారంతో సీఐ శాలిగౌరారం, తిప్పర్తి ఎస్సై తమ సిబ్బందితో అలాగే సీఐ రమేశ్ బాబు, ఎస్‌ఐ లు మహేందర్, రామకృష్ణ వారి సిబ్బందితో సంయుక్తంగా తనిఖీలు చేసి పట్టుకున్నారు. కాస్లే నర్సింహా, గోవింద్ సింగ్, లతో పాటు నల్లగంటి భీమా, శివకోటి ఉమా మహేశ్, తమన్ కలిసి ఈ గంజాయిని తరలిస్తుండగా వారిని పట్టుకున్నారు పోలీసులు. గంజాయిని రవాణ చేసినందుకు ఒకొక్కరికి రూ.20వేల చొప్పున తమన్ ఇచ్చేవాడు. ఇక నిందితులను పట్టుకున్న పోలీసులను డీఎస్పీ అభినందించారు.