MSME Policy-2024: తెలంగాణ ఎంఎస్ఎం‌ఈ - 2024 పాలసీ విడుదల.. ఆవిష్కరించిన సీఎం రేవంత్‌ రెడ్డి

రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నూతన ఎంఎస్‌ఎంఈ (MSME) పాలసీ-2024ను ఇటీవలే ప్రకటించింది.

Update: 2024-09-18 07:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నూతన ఎంఎస్‌ఎంఈ (MSME) పాలసీ-2024ను ఇటీవలే ప్రకటించింది. ఈ మేరకు బుధవారం మాదాపూర్ శిల్పకళా వేదికలో కొత్త ఎంస్ఎంఈ పాలసీ-2024ను సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా వ్యాపారాలు, పెట్టుబడుల విస్తరణకు కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తామని సీఎం ఇప్పటికే చాలా సందర్భాల్లో వెల్లడించారు. ప్రపంచ దేశాలకు ధీటుగా పారిశ్రామిక ప్రగతిని సాధించేందుకు రాష్ట్రంలోనూ పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని అన్నారు.

ప్రపంచంలో ఆర్థిక వృద్ధిలో ముందంజలో ఉన్న అమెరికా, చైనా లాంటి అగ్ర దేశాలకు ధీటుగా తెలంగాణ నూతన పరిశ్రామిక విధానానికి తీసుకురానున్నట్లుగా సీఎం రేవంత్ గతంలో అన్నారు. ఎంఎస్ఎంఈ పాలసీ-2024లో భాగంగా ప్రభుత్తం మొత్తం ఆరు విధానాలను అందుబాటులోకి తీసుకురానుంది. పారిశ్రామిక అభివృద్ధికి ఎంఎస్‌ఎంఈ పాలసీ, ఎగుమతి విధానం (Export Policy), కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీ (New Life Sciences Policy), రివైజ్డ్ ఈవీ పాలసీ (Revised EV Policy), మెడికల్ టూరిజం పాలసీ (Medical Tourism Policy), గ్రీన్ ఎనర్జీ పాలసీ (Green Energy Policy)లను సీఎం ఇప్పటికే ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ నూతన MSME పాలసీ-2024‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.


Similar News