పేదలకు ఇచ్చిన ఆ నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి.. హైడ్రాపై ఈటల కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ నగరంలో గత నెల రోజులుగా అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది.

Update: 2024-08-29 08:12 GMT

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో గత నెల రోజులుగా అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. దీంతో పలువురు నాయకులు హైడ్రా కు మద్దతుగా నిలుస్తుండగా.. పలువురు నేతలు మాత్రం అమాయక ప్రజలకు నోటీసులు ఇచ్చి.. సమయం ఇవ్వకుండానే కూలగొడుతున్నారని.. ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఈటల పేదల ఇళ్ల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని.. వార్నింగ్ ఇచ్చారు. చెరువుల్లో పట్టా భూములు ఉంటే పేద ప్రజలకు ప్రత్యామ్నాయం చూపించాలని అన్నారు. అలాగే పేదలకు ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని.. లేదంటే సీఎం రేవంత్ సంగతి చూస్తామని ఎంపీ ఈటల చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే హైదరాబాద్‌లోని మాదాపూర్‌, దుర్గం చేరువును ఆనుకోని ఉన్న అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో తిరుపతిరెడ్డి ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. కాగా ఆ ఇల్లు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఈ నోటీసులు ఇచ్చారు. అలాగే దుర్గం చెరువును అనుకుని ఉన్న కావూరి హిల్స్, సెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా హైడ్రా నోటీసులు జారీ చేసింది. అలాగే నెల రోజుల్లో అక్రమ కట్టడాలు అన్ని కూల్చేయాలని నోటీసుల్లో తెలిపింది.


Similar News