Eatala: కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌‌కు.. ఓయూ సర్క్యులర్‌పై ఈటల ఫైర్

ఎన్నో ఉద్యమాలకు వేదికైన ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు, నిరసనలకు నిషేధం విధిస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ తాజాగా సర్క్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే.

Update: 2025-03-17 10:11 GMT
Eatala: కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌‌కు.. ఓయూ సర్క్యులర్‌పై ఈటల ఫైర్
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నో ఉద్యమాలకు వేదికైన ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు, నిరసనలకు నిషేధం విధిస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ తాజాగా సర్క్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బీఆర్ఎస్, బీజేపీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (MP Eatala Rajender) స్పందించారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యమాల పురిటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ, ఆ విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని ఎంపీ ఈటల అన్నారు. నిరసన తెలపడం విద్యార్థుల హక్కు అని, దానిని హరించి వేయాలని చూస్తే వారికి పుట్టగతులుండవని పేర్కొన్నారు. ఇలా చేసిన (KCR) కేసీఆర్‌ను ఇంటికి పరిమితం చేశారు.. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మీకు కూడా అదే గతి పడుతుంది.. నిరకుశత్వ పోకడలు పక్కన పెట్టి సర్క్యులర్ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఓయూ విద్యార్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

Tags:    

Similar News