సైనిక్ స్కూల్ ఏర్పాటులో బీఆర్ఎస్ నిర్లక్ష్యం : పాలమూరు ఎంపీ డీకే అరుణ

సైనిక్ స్కూల్ ఏర్పాటులో బీఆర్ఎస్ తీవ్ర నిర్లక్ష్యం చేసిందని ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు.

Update: 2024-08-09 16:20 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : సైనిక్ స్కూల్ ఏర్పాటులో బీఆర్ఎస్ తీవ్ర నిర్లక్ష్యం చేసిందని ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. పాలమూరు నియోజకవర్గ ప్రజల ప్రతిపాదనల ప్రకారం సైనిక్ స్కూల్ ను కేంద్రం ఇప్పటికే మంజూరు చేసినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ చేయకుండా నిర్లక్ష్యం చేసిందని డీకే అరుణ ఘాటు విమర్శలు చేశారు. ఎంపీగా గెలిచిన డీకే అరుణ తొలిసారి పార్లమెంట్ లో తన గళాన్ని వినిపించారు. ఈనేపథ్యంలో శుక్రవారం జీరో హవర్‌లో నారాయణపేట జిల్లాలో సైనిక్ స్కూల్ ఏర్పాటు ఆవశ్యకతను కేంద్ర దృష్టికి తీసుకెళ్లారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సైనిక్ స్కూల్ లేదని, ఏర్పాటు చేయాలని ఆమె నొక్కి చెప్పారు. జిల్లాలోని ఎక్లాస్ పూర్ వద్ద 50 ఎకరాల్లో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు సర్వే కూడా చేపట్టారని, ఆ ప్రక్రియ కూడా పూర్తయిందని డీకే అరుణ వివరించారు. కావున కేంద్రం చొరవ చూపి వీలైనంత త్వరగా సైనిక్ స్కూల్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని డీకే అరుణ కోరారు. మహబూబ్ నగర్ ఎంపీగా తనను గెలిపించిన మహబూబ్ నగర్ పార్లమెంట్ ప్రజలు, ఓటర్లందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.


Similar News