MP Chamala : సీఎం రేవంత్ రిప్లై.. ప్ర‌ధాని మోడీ త‌న ట్వీట్ డిలీట్ చేశారు.. ఎంపీ చామల

ప్ర‌ధాని మోడీ త‌న ట్వీట్ డిలీట్ చేశారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

Update: 2024-11-03 12:50 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: జార్ఖండ్, మహారాష్ట్రలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలను నెరవేర్చలేదని ట్వీట్ చేశారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ ట్వీట్ చేయగా, తమ సీఎం రేవంత్ రెడ్డి పూర్తి వివరాలతో కౌంటర్ ఇచ్చారని ఎంపీ చామల అన్నారు. కాంగ్రెస్ పది నెలల పాలనలో ఇచ్చిన ఉద్యోగాలు, రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 సిలిండర్, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ గురించి క్లారిటీగా ట్వీట్ ద్వారా వెల్లడించారని తెలిపారు. దీంతో మోటీ ట్వీట్ తొలగించాల్సి వచ్చిందని విమర్శించారు.

అనంతరం తెలంగాణలో బామ్మర్ది టిల్లు, బావ సొల్లు.. పొద్దున లేస్తే.. ఎక్స్‌లో కేటీఆర్ సూపర్ యాక్టివ్ ఉంటారని అన్నారు. ఎక్స్ యజమాని ఎలన్ మస్క్ వారి పర్ఫామెన్స్‌పై చాలా సంతోషంగా ఉన్నారని సెటైర్లు వేశారు. ఎక్స్ ప్లాట్‌ఫామ్‌ను చాలా బ్రహ్మండంగా వాడుతున్నారని ఎలన్ మస్క్ వీరిని అభినందించే ప్రయత్నం చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఎక్స్‌లో బీఆర్ఎస్ చేస్తున్న త‌ప్పుడు ప్ర‌చారాల‌కు ఎక్స్ హెడ్ ఆఫీస్‌లో వారికి సన్మానం చేయాలని ఎలన్ మస్క్‌ను కోరారు.

Tags:    

Similar News